అభిమానులకు లేఖ రాసిన బాలకృష్ణ

August 05, 2020

అభిమానులు - బాలకృష్ణ... ఎంత ఆప్యాయంగా ఉంటారంటే... ఏ హీరో కన్నా బాలయ్య ఎక్కువ సార్లు కోప్పడ్డా... బాలయ్యే మా ప్రాణం అంటారు వాళ్లు. బాలయ్య వాళ్లకి ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ మెదడులోకి వచ్చిన మరుక్షణం వారు ఒక లోకంలో తేలియాడుతుంటారు. అయితే... బాలకృష్ణ 60వ పుట్టిన రోజును అభిమానలందరు కలిసి చేసుకునే అవకాశం లేకుండా చేసింది ఈ క.రోనా. ఈ నేపథ్యంలో బాలయ్య అభిమానులకు ఒక లేఖ రాశారు. మీ ఆశీర్వాదం నాకుంది. మీ అభిమానం నాతోడుంది.. మీ క్షేమము, ఆరోగ్యమే నాకు కావాలి అంటూ బాలయ్య రాసిన లేఖ వైరల్ అవుతోంది. కింద లేఖ ను చూడొచ్చు.