బాలకృష్ణకు.. జగన్ కు మధ్యనున్న లింకు చెప్పేశాడు వైసీపీ నేత

August 14, 2020

సోషల్ మీడియాలో చాలానే మాటలు వినిపిస్తుంటాయి. అంతమాత్రానికే అవన్నీ నిజాలు అనుకోవటానికి వీల్లేదు. అదే సమయంలో అబద్ధాలు అని కూడా అనలేం. కాకుంటే.. అలాంటి వాటిల్లో నిజం ఎంతన్నది ఎంతకూ తేలని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత.. కమ్ సీనియర్ నటుడు విజయ్ చందర్ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

ప్రస్తుతం ఆయన ఏపీ స్టేట్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారిన జగన్మోరెడ్డి వ్యక్తిగతంగా ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణను విపరీతంగా అభిమానిస్తారన్న మాట ఎప్పటి నుంచో వింటున్నదే. తాజాగా అదే విషయాన్ని నటుడు విజయ్ చందర్ కన్ఫర్మ్ చేశారు.

తాజాగా ఆయన మాట్లాడుతూ.. బాలయ్య అంటే జగన్ కు ప్రత్యేక అభిమానమని చెప్పారు. ఒకప్పుడు జగన్ కు బాలయ్య సినిమాలు అంటే చాలా ఇష్టమని.. బాగా చూసేవారని చెప్పారు. అయితే.. గతం గురించి మాట్లాడిన విజయ్ చందర్.. వర్తమానం గురించి మాత్రం చెప్పకుండా ఉండటం వివేషం. ఏమైనా.. కోట్లాదిమంది ప్రజల అభిమానాన్ని పొందిన అధినాయకుడి మనసును గెల్చుకున్న నటుడు బాలయ్య కావటం ఆసక్తికరంగా మారింది. తనకు జగన్ వీరాభిమాని అన్న విషయంపై బాలయ్య ఎలా రియాక్టు అవుతారో?