పేషెంట్ ను ముద్దాడిన బాలయ్య... నెటిజన్ల హర్షం

August 03, 2020

నందమూరి బాలకృష్ణ. తెలుగు ప్రజల్లోనే ఒక విభిన్నమైన వ్యక్తిత్వం. అతని జ్జానం, ఆయన స్థాయి ఏంటన్నది పక్కన పెడితే, తనకు మంచి అనిపించింది చేయడంలో అతనికి అతనే సాటి. ఇతరులపై కక్షలు, దురుద్దేశాలు అనే వాటి గురించి క్షణమైనా ఆలోచించని మనిషి. ఇతరుల గురించి మంచి మాట్లాడితే అది అతని హృదయం నుంచి వస్తుంది. ఇతరులపై విమర్శలు చేస్తే అవి అతని నాలుక మీద నుంచి వస్తాయి. అతను శాశ్వతంగా అభిమానిస్తాడు, తాత్కాలికగా విమర్శిస్తాడు. ఇది బాలయ్య స్టైల్. 

ఇటీవల అనంతపురం క్యాన్సర్ పేషెంట్ గురించి ఎవరి ద్వారానో బాలయ్యకు తెలిస్తే ఆమె చికిత్స నా బాధ్యత అన్నా బాలకృష్ణ. కేవలం ప్రకటనతో వదిలిపెట్టలేదు. స్వయంగా కలిశారు. చికిత్స ఇప్పిస్తున్నారు. యోగ క్షేమాలు చూస్తున్నారు... ఏకంగా ఆమెను ముద్దాడి మనస్ఫూర్తిగా దేవుడు చల్లగా చూడాలి అని ఆమెను కోరుకున్నారు. ఆ ఫొటోలు ఇవి.