రూలర్ టైటిల్ ... బాలయ్య కి ఎవరిచ్చారో తెలుసా?

July 06, 2020

వయసు మీరినా యువ హీరోలతో పోటీ పడుతున్నారు నందమూరి బాలకృష్ణ. సినిమాల్లో నటిస్తున్నారంటే ఏదో అనుకోవచ్చు. డ్యాన్సుల్లోనూ తగ్గట్లేదు. అటు రాజకీయాలు, ఆస్పత్రి వ్యవహారాలు, సినిమాలు ఏకకాలంలో అనేక పనులు ప్రశాంతంగా చేసుకుంటూ పోతూ ఏ ఒత్తిడీ లేకుండా హాయిగా జీవించేస్తున్నారు బాలయ్య. తాజాగా ఆయన సినిమా ఈరోజు విడుదల కానుంది. ’రూలర్‘ పోలీసు పాత్రతో పాటు ఇతర షేడ్ లో కూడా బాలయ్యకు అలవాటైన పాత్రలో తీర్చిదిద్దిన ఈ సినిమా కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓవర్సీస్ పక్కన పెడితే... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ క్రేజు తగ్గకపోవడం బాలయ్యకే చెల్లింది.

తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు బాలయ్య. వాస్తవానికి ఈ సినిమాకు వేరే టైటిల్ అనుకున్నారు. ప్రస్తుతం పెట్టిన టైటిల్ బోయపాటి చాలారోజుల క్రితమే రిజిస్టర్ చేసుకున్నారు. కానీ బాలయ్యతో పాటు నిర్మాత కళ్యాణ్ అడిగిన వెంటనే బోయపాటి ఆ టైటిల్ ను ఈ సినిమాకు ఇచ్చేశారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయం బాలయ్య వెల్లడించారు. మొన్నటి ప్రి రిలీజ్ ఫంక్షనులో కూడా ఈ విషయం ఎవరూ చెప్పలేదు. కానీ సడెన్ గా ఈ విషయం ఓ ఇంటర్వూలో వెల్లడించారు.