బాలయ్య షాక్... చిరంజీవి తెచ్చిన 5 కోట్లు ఏమయ్యాయి?

August 05, 2020

రహస్యాలు లేకపోతే ఎందుకు పిలవలేదు అన్నమాట కు ఏవేవో అర్థాలు వెతికిన నాగబాబు చివరకు చిరంజీవిని అనవసర వివాదాల్లో నెట్టేశారు. ఎవర్ని కెలక్కూడదో వారినే కెలికిన నాగబాబు ఇపుడు అనవసరంగా చరిత్రను తవ్వి చిరంజీవిని మరిన్ని అవమానాల పాలు చేశారు. ఇపుడు బాలకృష్ణ వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలే పరిస్థితి.

తాజాగా ఓ డిజిటల్ మీడియాకు బాలయ్య ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు ప్రస్తావన వచ్చింది. అయితే... పాత మాటను పరిష్కరించడానికి బదులు బాలయ్య కొత్త రహస్యాలను బయటపెట్టి ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారం మరో వివాదానికి దారితీసింది. ఎలాంటి మాటైన మాట్లాడటానికి వెనుకాడని బాలయ్యని కదిలిస్తే ఇలాంటి ఇబ్బందులు తప్పవు. ఇంతకీ బాలయ్య తాజాగా చేసిన సంచలన ఆరోపణలు ఆయనమాటల్లో వింటే...

‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం బిల్డింగ్ కడతామని అన్నారు. అమెరికా వెళ్లారు. నన్ను పిలిచారా? చిరంజీవి గారు అంతా కలిసి అమెరికా వెళ్లారు. డల్లాస్‌లో ఫంక్షన్ చేశారు. ఐదు కోట్లు అన్నారు. వాటన్నిటిలో నేను ఇన్‌వాల్వ్ కాను. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు ఫ్లవర్‌తో సమానం. ఎప్పుడూ ప్రకాశవంతంగా, బ్యూటీగా కనపడాలి. ఇవన్నీ ఎందుకు తలనొప్పులు. కాని పనికి ఎందుకు వెళ్లి కూర్చోవడం. ఇవాళ కట్టారా ‘మా’ కోసం బిల్డింగ్. ఇవాళ గవర్నమెంట్ (తెలంగాణను ఉద్దేశించి) ఎంతో సపోర్టింగ్‌గా ఉంది. మేమంతా ఇక్కడ ఉన్నాం కాబట్టి (ఈ గవర్నమెంట్) అంటున్నాను. మరి ఇవాళ అడిగితే 2-3 ఎకరాలు ఫ్రీగా ఇవ్వరా? ఇండస్ట్రీ నుంచి ఎంత టాక్స్ కలెక్ట్ చేస్తున్నారు? కరోనాని పక్కన పెట్టి ఎందుకు సినిమా షూటింగ్స్ మొదలెట్టాలని ఎందుకు ఆరాటం? కారణం టాక్స్‌లు.. డబ్బు. ఈ సొసైటీలో అత్యధికంగా టాక్స్ పే చేసేది మా ఇండస్ట్రీనే.  5 కోట్లు తెస్తామన్నారు. ఇంత వరకు భవనం కట్టలేదు. ఒక్క బిల్డింగ్ కట్టడానికే.. మద్రాస్‌లో చూడండి. మేం డబ్బులు పెట్టి కట్టుకోలేమా? ఆ ఆలోచనలు రావు. అక్కడికి వెళ్లారు. ఏదో 5 కోట్లు అన్నారు. తర్వాత కోటి అన్నారు. మిగతా 4 కోట్లు ఏమయ్యాయి? ఏంటి ఇవన్నీ.. ఎవడు కూర్చుంటాడు. ఎందుకు.. ఏమన్నా లెక్కల మాస్టర్లా? అందుకే ఏం కలుగజేసుకోను. హిపోక్రసి, సైకోఫాన్సీలు ఎక్కువ. మైకులు చూడగానే పిచ్చెక్కుతుంది కొందరికి..’’ 

ఇవి బాలయ్య వ్యాఖ్య యతాతథంగా. మొన్నటి ఇష్యూ ఎలా సద్దుమణుగుతుందా అని ఇండస్ట్రీ తలపట్టుకుంటుంటే బాలయ్యను అనవసరంగా కదిలించి కొత్త సమస్యను తెచ్చిపెట్టారు. ఇది ఎక్కడకు పోయి ఆగుతుందో తెలియని పరిస్థితి.

Image