ఆ పని చేసే వరకు గొడవ ఆగదు - బాలకృష్ణ

August 09, 2020

నటసింహం బాలకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు కేసీఆర్ ను, తలసానిని కలవడానికి వెళ్లినపుడు నందమూరి బాలకృష్ణను ఆహ్వానించలేదు. అయితే, దీనిపై ఆయనంతట ఆయన స్పందించలేదు. ఎవరో మీడియా వాళ్లు ప్రశ్నించినపుడు ఏమో భూములు పంచుకోవడానికెళ్లారేమో అందుకే నన్ను పిలవలేదేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అనుభవంతో సినిమా వాళ్లు జాగ్రత్త పడ్డారు. ఏపీ సీఎం జగన్ ని కలవడానికి 9న తేదీ ఫిక్స్ చేశారు. ఆ మీటింగ్ కు సి కళ్యాణ్ బాలకృష్ణను ఆహ్వానించిన కళ్యాణే తెలిపారు. అయితే పుట్టిన రోజు ఏర్పాట్ల కారణంగా తాను హాజరు కాలేకపోతున్నానని చెప్పారట.

అయితే... తాజాగా దానిపై స్పందించిన బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కొందరు స్వార్థంతో చేస్తున్నారని అన్నారు. టాలీవుడ్ బాగు కోసం అయి ఉంటే నన్ను పిలవాల్సిన అవసరం లేదు. నేనే వస్తాను. కానీ ఏవేవో ఉద్దేశాలు ఉన్నట్టున్నాయి. సినిమా పరిశ్రమ బాగుపడుతుంది అంటే దానికి ఎపుడూ నేను సిద్ధమే. దీనికోసం ఇప్పటికే ఎన్నో చేశాను. ఇక నుంచి కూడా చేస్తాను అన్నారు బాలకృష్ణ. 

ఏపీ సీఎంను టాలీవుడ్ నుంచి కొందరు కలుస్తారట. నాకు దీనిపై సమాచారం లేదు అన్నారు. మరి మొన్న కళ్యాణ్ పిలిచింది నిజమేనా? అబద్ధమా? లేకపోతే కళ్యాణ్ పిలుపును సినిమా పరిశ్రమ పిలుపుగా బాలయ్య భావించడం లేదా అన్నది అనుమానం. ఇక గొడవల గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు ఒక్కరే నన్ను కలిశారు. స్వార్థం ఉందికాబట్టే మిగతా వాళ్లలో బెరుకు. స్వార్థం ఉన్నంత వరకు వివాదాలు సద్దుమణగవు అంటూ ఒక హెచ్చరిక స్వరంతో బాలయ్య వ్యాఖ్యానించాడు. స్టూడియోల గురించిన తాపత్రయం ఇదంతా అని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.