అమెరికాలో బాలయ్య బర్త్ డే - కోమటి జయరాం ఏర్పాట్లు

August 13, 2020

టాలీవుడ్ హీరో, నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  జూన్ 10న  60వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఏపీ, తెలంగాణతోపాటు అమెరికాలోనూ తమ అభిమాన హీరో బాలయ్య బాబు పుట్టిన రోజును అభిమానులు ఘనంగా నిర్వహిస్తుంటారు. అమెరికాలో బాలయ్య బాబు 50వ పుట్టిన రోజు వేడుకలను ప్రముఖ ఎన్నారై కోమటి జయరాం అమెరికా వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు. ఈ సారి కూడా కోమటి జయరాం చేతుల మీదుగానే బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు అమెరికావ్యాప్తంగా ఘనంగా జరగబోతున్నాయి. 

లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే అమెరికావ్యాప్తంగా ఓ జ్జాపకంలా నిలిచిపోయేలా ఈ వేడుకలను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య అభిమానులు, టీడీపీ అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొనాలని కోమటి జయరాం పిలుపునిచ్చారు.అమెరికా వ్యాప్తంగా జరగబోయే ఈ వేడుకలను జయప్రదం చేయాలని కోరారు