గుంటూరులో బాలయ్య బర్త్ డే హంగామా

August 07, 2020

హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ  నేడు 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలోని పలు నగరాల్లో బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓ వైపు లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే తమ అభిమాన హీరో పుట్టిన రోజు పండుగను కన్నుల పండువగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలతో పాటు పలు నగరాల్లో బాలయ్య బాబు బర్త్ డేని ఘనంగా నిర్వహించారు. 

గుంటూరుతో పాటు పలు నగరాల్లో ఫ్యాన్స్ తో పాటు పలువురు రాజకీయ నేతల ఆధ్వర్యంలో బాలయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరు నగరంలో గుంటూరు వెస్ట్ టీడీపీ ఇన్ చార్జి కోవెలమూడి రవీంద్ర, గుంటూరు వెస్ట్ టీడీపీ నేతలు బుచ్చి రాం ప్రసాద్, కనపర్తి శ్రీనివాసరావు, కొత్తూరి వెంకట్, మానం శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో బాలయ్య బాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ కేక్ కట్ చేయడంతోపాటు పలు కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనలకు లోబడే ఈ వేడుకలను నిర్వహించారు బాలయ్య ఫ్యాన్స్. లాక్ డౌన్ లేకుంటే బాలయ్య షష్టి పూర్తి జన్మదినోత్సవాన్ని మరింత అంగరంగ వైభవంగా నిర్వహించి ఉండేవారమని ఫ్యాన్స్ అంటున్నారు.

 

RELATED ARTICLES

  • No related artciles found