మెగా ఫ్యామిలీకి అనంతపురంలో నో ఎంట్రీ

February 22, 2020

నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా రేపు విడుదల కానుంది. అయితే, ఈ సినిమాకు పెద్ద చిక్కొచ్చిపడింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఈ సినిమా టైటిల్ ఒక కులానికి సంబంధించినది. రామాయణం రాసిన వాల్మీకి ఈ బోయ కులానికి దైవం. ఈ కులం అనంతపురం, కర్నూలు జిల్లాలో ఎక్కువగా విస్తరించి ఉంది. అనంతపురం ఎంపీ రంగయ్య కూడా ఇదే కులస్తుడు. 

వాల్మీకి అనే పేరు పెట్టడం, ఆ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్ తో ఉండటంతో బోయకులస్తులు కొందరు దీనిపై అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో ఆ సినిమా విడుదల ఆపాలని అనేక వినతులు వచ్చాయి. ప్రభుత్వంపై దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా సినిమా విడుదలనే ఆపేసింది. సినిమా ఎలా ఉందో తెలియకనే... క్యారెక్టర్ ఎలాంటిదో తెలియకనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని మెగా అభిమానులు వాపోతున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలో ఈ సినిమా విడుదలను నిలిపివేస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. మిగతా చోట్ల ఈ సినిమా యథావిధిగా విడుదల కానుంది.