ఆ చైనా యాప్ కి మూడింది... ఇండియన్స్ యాంగ్రీ

August 14, 2020

దేశమంతటా ఈరోజు కొత్త నినాదం మొదలైంది. అదే ’బ్యాన్ టిక్ టాక్’... ఎందుకు అన్నది పక్కన పెడితే టిక్ టాక్ లో మంచి కంటే చెడు ఎక్కువ. ఎందుకంటే చెడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మంచికి ఆ లక్షణం ఉండదుగా. అందుకే టిక్ టాక్ లో కావల్సినంత మంచి ఉన్నా అది వినోదాన్ని పండించదు కాబట్టి టిక్ టాక్ లో విపరీత ప్రవర్తనలకే ఆదరణ ఎక్కువ. 2000 కి ముందు క్రికెట్ వల్ల ఒక జనరేషన్ చెడిపోయిందని అంటుండే వారు. పిల్లలు బడి, గుడి వదిలేసి అదే ఆటలో మునిగి తేలుతారని అలా తల్లిదండ్రులు వాపోయేవారు.

కానీ టిక్ టాక్ వంటి ఘోరాలు చూస్తున్నాక... ఆ క్రికెట్లో మునిగితేలినా బాగుండేది కనీసం పిల్లల్లో ఆరోగ్యం; ఫిట్ నెస్ బాగుండేది, నలుగురితో కలిసిమెలిగేవారు. ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండేదంటున్నారు. ఈ టిక్ టాక్ లు, వీగోలు జనాల్ని నాశనం చేస్తున్నాయి. విపరీత ప్రవర్తనలు, కొత్త నేరపూరిత ఐడియాలు, అసభ్యతను జనాల్లో అలవాటుగా మారుస్తున్నాయి. సెన్సిబులిటీని దెబ్బతీస్తున్నాయి. 

టిక్ టాక్ ప్రభావానికి పరాకాష్ట ఏంటో ఒక్క ఉదాహరణలో చెప్పుకుంది. ఇప్పటి మగపిల్లలను ఎలాంటి పెళ్లాం కావాలో చెప్పమని అడిగితే.... టిక్ టాక్ అలవాటు లేని పెళ్లాం కావాలి... అంతకుమించి ఇంకేం వద్దు అంటున్నారట.  దీన్ని బట్టి మన అమ్మాయిల్లో అనేక మంది దీనికి ఎంత బానిసలు అయ్యారో తెలిసిపోతుంది. టిక్ టాక్ లో ఇపుడు పరిచయాలు ప్రేమలుగా కూడా మారుతున్నాయి. అదో పరాకాష్ట. బయటికి తెలియని ఎన్నో నేరాలు, ఘోరాలకు  టిక్ టాక్ కారణమవుతోందంటే మీకు నమ్మశక్యంగా అనిపించకపోయినా నిజం. 

మొత్తానికి ఈ చైనా యాప్ కి మన దేశంలో మూడినట్లు కనిపిస్తోంది. చైనా పై ప్రపంచం మొత్తం ఇపుడు పీకలదాకా కోపంగా ఉంది. ఇటీవల మోడీ చేసిన వోకల్ ఫర్ లోకల్ నినాదం ప్రభావం కూడా దీని మీద పడుతోంది. పైగా చైనా వాడు ఈ యాప్ ద్వారా మన డేటానంతా సేకరిస్తున్నాడన్నది స్పష్టమైపోయింది.  నిన్నటి నుంచి దీనిని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు సోషల్ మీడియాలో బ్యాన్ టిక్ టాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. లక్షల గొంతులు ఏకమై ఈ నినాదాన్ని వినిపిస్తున్నాయి. ఇటీవల దాకా 4 ప్లస్ రేటింగ్ ఉన్న ఈ యాప్‌కు ఇప్పుడు ప్లే స్టోర్‌లో రేటింగ్  2 కి పడిపోయింది. మన మంచి కోసం, మన భవిష్యత్తు కోసం దీనికి దూరంగా ఉండటం మంచిది. లేకపోతే మన జుట్టు చైనా చేతిలో ఉంటుంది.