అమెరికాలో అరిటాకు భోజనం.. అందరూ ఫిదా !!

July 05, 2020

పెళ్లి ... తెలుగు ప్రజల ఇంట జీవితంలో జరిగే అతిపెద్ద పండుగ. అలాంటి పెళ్లిని ఎవరి స్థాయిలో వారు ఓ రేంజ్ లో చేయాలని తలపెడుతుంటారు. చిన్నవారిది అయినా, పెద్ద వారిది అయినా... ఒక పెళ్లిని ఇంకో పెళ్లితో పోల్చలేం. అది ఒక కుటుంబపు అతిపెద్ద పండుగ. కాబట్టి ఆ ఇంట గుర్తుండిపోయేలా చేసుకుంటారు. తెలుగు నేలలో వెైభవంగా తెలుగు సంప్రదాయాలను గుర్తుచేస్తూ ఘనంగా పెళ్లి చేసుకోవడం తరచుగా చూస్తుంటాం. కానీ కోమటి జయరాం పశ్చిమాన సెటిలై, పాశ్చాత్య వధువును కోడలిగా తెచ్చుకుంటూ కూడా అచ్చం మన ఊరిలో చేసినంత సంప్రదాయ బద్ధంగా అక్కడ పెళ్లి చేశారు.

చాలా గ్రాండ్ పెళ్లిళ్లు చాలామంది చేసి ఉండొచ్చు గాని... ప్రతి ఒక్కరికీ సొంత ఊరిని స్మృతికి తెప్పించిన అత్యంత ఆనందదాయకమైన వేడుకగా ప్రవాసాంధ్రులకు ఒక మరుపురాని అనుభూతిని రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు కోమటి జయరాం. అమెరికాలోనూ పంచెలో బంధువులందరూ వంట చేతబట్టి... అరిటాకులో వడ్డిస్తూ, చక్కగా కబుర్లు చెప్పుకుంటూ విందు ఆరగించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లికి ఈ విందు తియ్యటి అనుభూతితో కూడిన ముగింపును ఇచ్చింది. ఈ అరిటాకు భోజనం ఇపుడు అక్కడ పెద్ద చర్చనీయాంశం.