బండ్ల గణేష్ కి కరోనా !

August 08, 2020

ఏపీ తెలంగాణ రాష్ట్రాలు కొత్త కేసుల్లో పోటీ పడుతున్నాయి. ప్రతిరోజు నీకంటే నేనెక్కువ అంటూ ఒకదానికి మించి ఒకటి కేసులు నమోదు చేస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే హైదరాబాదులో వాతావరణం ప్రమాదకరంగా కనిపిస్తోంది.

తాజాగా ఈరోజు తెలంగాణలో ఒకటి తక్కువ 500 కేసులు నమోదు కావడం సంచలనం. ఈరోజు కరోనా ఫలితాల్లో మాజీ కాంగ్రెస్ నేత, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఉన్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ షాద్ నగర్ లో ఉంటున్నారు.

బండ్ల గణేష్ కి ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో హోం క్వారంటైన్లో ఉంచారు. 

ఇది ఒకే ఆస్పత్రికి చెందిన 33 మంది సిబ్బందికి ఈరోజు కరోనా సోకడం సంచలనం అయ్యింది. నలుగు ఐపీఎస్ అధికారులకు కూడా కరోనా సోకింది.

ఇక ఏపీలో ఈరోజు 425 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, అనంతపురం జిల్లాలను లాక్ డౌన్ చేశారు. దీన్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థమవుతోంది. 

 

తెలంగాణలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే... 2500 మందికి టెస్టు చేస్తే 20 శాతం మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇది అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ.