లాక్ డౌన్ 4 లో మోడీ చెప్పిన అతిపెద్ద గుడ్ న్యూస్ ఇదే

August 15, 2020

లాక్ డౌన్ 3 ముగిసింది. యథావిదిగా మనం ఊహించినట్టు లాక్ డౌన్ 4.0 వచ్చేసింది. దేశంలో కేసుల సంఖ్య తగ్గకపోగా పెరుగుతూనే ఉంది. అయినా సడలింపులు ఇవ్వక తప్పడం లేదు. ఎందుకంటే ఎకానమీ దెబ్బ కరోనా కంటే భయంకరమైనది. కరోనా మహా అయితే రోగం వచ్చిన వాళ్లలో బలహీనులను, వృద్ధులను చంపేస్తుంది. కానీ ఎకానమీ క్లోజ్ చేస్తే వయసు, ఆరోగ్యంతో సంబంధం లేకుండా అందరూ దెబ్బతింటారు. కరోనా కంటే ఎకనామీ చావులే ఎక్కువ. అందుకే కేంద్రం సడలింపులకే మొగ్గు చూపింది.

అయితే, నాలుగో లాక్ డౌన్ లో ఇచ్చిన సడలింపుల్లో ఒకటి మాత్రం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అదే స్పా, సెలూన్లు, బ్యూటీ పార్లర్లకు అనుమతి ఇవ్వడం. ఇది ప్రతి ఒక్కరికీ ఇపుడు నిత్యావసరం అయిపోయింది. దీనిపై రిక్వెస్టులు కూడా బాగా పెరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో అందరూ వీటిని ఓపెన్ చేయాలని అడుగుతున్నార. ఈ నేపథ్యంలో కేంద్రం వీటికి అనుమతి ఇచ్చింది. అటు బార్బర్ల సంక్షేమం, ఇటు ప్రజల అవసరం రెండూ గుర్తుంచుకని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

గవర్నమెంటు అనుమతి ఇచ్చింది. ఓపెన్ చేస్తున్నారు. అయితే, మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే ఇది కరోనా వ్యాప్తికి బాగా అవకాశం ఉన్న రంగం. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. అందుకే సెలూన్లు బ్యూటీ పార్లర్ల విషయంలో నమస్తే ఆంధ్ర.కాం మీకోసం కొన్ని సలహాలు ఇస్తోంది. దయచేసి వీటిని పాటించండి.

  • షేవింగ్ ఇంట్లోనే చేసుకోండి.
  • కేవలం కటింగ్ కు మాత్రమే సెలూన్ కి వెళ్లండి. 
  • టవల్ మీరే తీసుకెళ్లండి. లుంగీ, శాలువా వంటి వస్త్రం తీసుకెళ్లి మీరు కూర్చునే చైర్ మీద పరచుకోండి. ఎవరైనా నవ్వినా పట్టించుకోవద్దు. మీ ప్రాణం మీకు ముఖ్యం.
  • శానిటైజర్ తీసుకెళ్లండి... వాళ్లు క్లీన్ చేశామని చెప్పినా సరే మీకు వాడే కత్తెర, దువ్వెనకు శానిటైజర్ స్ప్రే చేసి రుద్దమండి. 
  • బార్బర్ చేతులను శానిటైజ్ చేయండి.
  • బార్బర్ కచ్చితంగా మాస్కు వేసుకుంటేనే వారితో మీరు హెయిర్ కట్ చేయించుకోండి.

మహిళల విషయానికి వస్తే మరీ పెళ్లి, ఫంక్షను ఉంటే తప్ప మహిళలు సెలూన్లు, స్పాలకు వెళ్లకపోవడం మంచిది. హోం సర్వీసును వాడుకుంటే చాలా వరకు బెటర్. టవల్స్, శానిటైజర్ కచ్చితంగా వెంట తీసుకెళ్లండి. ఫేషియల్స్ ఎట్టి పరిస్థితుల్లో బయట చేయించుకోవద్దు. ఇంట్లోనే మీరే చేసుకోండి. అందం లేకపోయినా బతకొచ్చు గాని ప్రాణం లేకపోతే బతకలేం.

 

ఇక... వీటితో పాటు గవర్నమెంటు వేటికి అనుమతి ఇచ్చిందో ఒకసారి పరిశీలిద్దామా?

* అంతర్రాష్ట్ర ప్రయాణ వాహనాలకు అనుమతి.
* సదరు రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు పరస్పర అనుమతులు తప్పనిసరి.
* ఆన్ లైన్ బిజినెస్ కు ఓకే.
* నిత్యవసర వస్తువులు మాత్రమే కాదు.. అన్ని రకాల వస్తువుల అమ్మకాలకు ఓకే.
* కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఈ కామర్స్ ను అనుమతించరు.
* క్యాబ్ సర్వీసులకు ఓకే. డ్రైవర్కాకుండా ఇద్దరు ప్రయాణం చేయొచ్చు.
* ఫూలింగ్ సర్వీసులపై నిషేధం కొనసాగింపు
* వేర్వేరు రాష్ట్రాలకు క్యాబ్ సర్వీసులకు అనుమతి.
* దేశీయంగా వైద్య సేవలకు ఓకే.
* రెస్టారెంట్లు హోం డెలివరీకి అనుమతి
* స్టేడియం.. క్రీడా కేంద్రాల్ని తెరుస్తారు. యాక్టివిటీస్ ఉండొచ్చు. కానీ..  ప్రేక్షకులు మాత్రం ఉండకూడదు
* 50 మంది అతిధులతో పెళ్లికి అనుమతి
* చనిపోతే అంత్యక్రియలకు 20 మంది వరకు అనుమతిస్తారు
* రైల్వేస్టేషన్లు.. బస్ స్టేషన్లలో క్యాంటీన్లకు అనుమతి
* వైద్యం.. పోలీస్.. ప్రభుత్వ ఉద్యోగులు.. హెల్త్ కేర్ వర్కర్లకు సేవలు అందించటంతో పాటు.. క్వారంటైన్ లో ఉన్న వారికి ఆహారం అందించే హోటళ్లకు పచ్చ జెండా