మోడీ గురించి బేర్ గ్రిల్స్ ఏమన్నాడో తెలుసా?

August 08, 2020

వరల్డ్ ఫేమస్ షో ’మ్యాన్ వర్సెస్ వైల్డ్‘ లో అంతర్జాతీయ సాహసికుడు బేర్ గ్రిల్స్ తో కలిసి ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో పర్యటించిన విషయం తెలిసిందే. సాధారణంగా ప్రధానులు ఈ సాహసాలకు ఒడిగట్టరు. ఇండియా ప్రధానిలో ఇలాంటి సాహస యాత్ర చేసి మొదటి ప్రధాని మోడీయే. ఆగస్టు 12న రాత్రి 9 గంటలకు ఈ షో డిస్కవరీ ఛానెల్లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో మోడీ గురించి బేర్ గ్రిల్స్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. 

ఏమాత్రం అనుకూలించని వాతావరణంలో మోడీ చాలా ధైర్యంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. మోడీ ధైర్యం చూసి ఆశ్చర్యపోయాను అన్నారు. అడవికి మన హోదాతో సంబంధం ఉండదు. దాని పట్ల ప్రేమతో, అంకితభావంతో ఉంటే తనలో ఇముడ్చుకుంటుంది. మోడీలోని ప్రకృతి మనిషిని చూశాను ఈ ప్రయాణంలో‘ అంటూ బేర్ గ్రిల్స్ వ్యాఖ్యానించారు. మా ప్రయాణంలో భారీ వర్షాలు ఇబ్బంది పెట్టాయి. జలపాతాల్లో కొండల్లో నడవాల్సి వచ్చింది. మా షూటింగ్ బృందం కూడా ఇబ్బందుల పాలయ్యింది. కానీ ఏ క్షణంలోనూ ప్రధాని మోడీ మొహంలో బెరుకు లేదు అని బేర్ గ్రిల్స్ చెప్పారు.