చిరంజీవి, రామ్ చరణ్ పై దాడి???

August 08, 2020

కంగారు పడకండి. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లపై తేనెటీగల దాడి జరిగింది. అయితే వారికి ఎటువంటి ప్రమాదమూ జరగలేదు. అందరూ సేఫ్ గా ఉన్నారు. ఇంతకీ ఈ దాడి ఎక్కడ జరిగంది? ఎపుడు జరిగింది అని తెలుసుకుందాం.

కామినేని ఉమాపతి రావు కుటుంబం అమ్మాయే కామినేని ఉపాసన. రాంచరణ్ భార్య.  27వ తేదీ ఉమాపతిరావు కాలం చేశారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు కామారెడ్డిలోని వారి కోటలో ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి కామారెడ్డిలోని దోమకొండకు చిరంజీవి కుటుంబం వెళ్లింది. చిరంజీవితో పాటు రాంచరణ్, ఉపాసన ఉన్నారు. 

అంత్యక్రియల ఏర్పాట్లు అనంతరం అందరూ అక్కడి వెళ్లే క్రమంలో ఓ చెట్టుపై నుంచి తేెనెటీగలు దాడి చేశాయి. వెంటనే గమనించిన భద్రతా సిబ్బంది అందరినీ అలర్ట్ చేసి కోటలోని ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈకార్యక్రమంలో కామారెడ్డి కలెక్టర్ ఎ.శరత్ కూడా ఉన్నారు. ఆయనకు కూడా ఏమీ కాలేదు.

ఓ నలుగురికి మాత్రం గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. వారి ప్రాణానికి ప్రమాదం ఏం లేదు. అందరూ క్షేమంగా ఉన్నారని తెలిసింది.