బెంగుళూరుకు వేరే ఛాన్స్ లేదని...

August 14, 2020

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని బెంగళూరులో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలన్న నిర్ణయాన్ని తీసుకుంది. ఎంత కంట్రోల్ చేసినా కేసులు తగ్గకపోగా పెరుగుతూ పోవడంతో కర్ణాటక ప్రభుత్వం చివరకు లాక్ డౌన్ కే మొగ్గు చూపింది.

ఇదిలా ఉండగా... కర్ణాటక ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే ఎట్టి పరిస్థితుల్లో లాక్ డౌన్ పెట్టం అంటూ పేర్కొంది. స్వయంగా వైద్య మంత్రి మీడియా ముందుకు వచ్చి ఎవరూ ఊళ్లకు వెళ్లకండి. లాక్ డౌన్ పెట్టం. మీరు ఊరికెళితే అక్కడ కేసులు పెరుగుతున్నాయని రిక్వెస్ట్ చేశారు. ఇపుడేమో గవర్నమెంట్ లాక్ డౌన్ పెడతాను అంటుంటే మంత్రి మమ్మల్ని మోసం చేశారంటున్నారు ప్రజలు.

లక్కీగా తక్షణ ప్రకటన కాకుండా ఊళ్లకు వెళ్లే వారికి సమయం ఇచ్చారు. జులై పద్నాలుగో తేదీ రాత్రి 8 గంటల నుంచి ఈ నెల 23వ తేదీ తెల్లవారుజామ వరకు లాక్ డౌన్ ఉంటుంది.  ఇక నిత్యవసరాలైన పాలు.. కూరగాయలు.. పండ్లు.. మందులతో పాటు.. కిరాణా సామాన్లు లాంటి అత్యవసరమైన షాపుల్ని మాత్రం తెరిచే ఉంచుతారు.

లాక్ డౌన్ కు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. దీనికోసం మహానగరాన్ని ఎనిమిది భాగాలుగా విభజించనున్నారు. ఒక్కో ప్రాంతం బాధ్యత ఒక్కో మంత్రికి ఇస్తారు. తమకు కేటాయించిన ప్రాంతాల్ని వారు స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఇలా ఒక్కో రాష్ట్రం లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్న వేళ.. తెలంగాణ రాష్ట్రంలోనూ లాక్ డౌన్ విధిస్తారా? అన్న చర్చ మొదలైంది.