ఆ సీఎంకున్న దమ్ము కేసీఆర్, జగన్ లకు ఉందా ?

August 11, 2020

ప్రశాంతంగా ఉన్న దేశాన్ని తబ్లిగీ జమాత్ కు హాజరైన ముస్లింలు అతలాకుతలం చేశారు. ఒక్కసారిగా దేశంలో కరోనాను విపరీతంగా వ్యాపింపజేశారు. అయితే... తొలుత వారు తెలియక చేశారు అని గవర్నమెంట్లు నమ్మాయి. అందుకే ఆ సదస్సుకు హాజరైన వారు వచ్చి పరీక్షలు, చికిత్సలు చేయించుకోండి అని గవర్నమెంట్లు పిలుపునిచ్చింది. అవన్నీ ఉచితం అని పేర్కొంది. ఇక్కడే గవర్నమెంట్లకు ఆ ముస్లింలు షాక్ ఇచ్చారు. పరీక్షలకు రాకుండా దాక్కున్నారు. అపుడు ప్రభుత్వాలకు వారిది అమాయకత్వం కాదు... దురుద్దేశం అని అర్థమైంది. అయితే... ఇంకా కొన్ని ప్రభుత్వాలు వారిపై చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నాయి. ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కానీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. 

 ఉత్తరాఖండ్ తీసుకున్న సంచలన నిర్ణయంతో తబ్లీగీలు ఒక్కసారిగా బయటకు రాక తప్పలేదు. ఇంతకీ ఆ రాష్ట్రం ఏం చేసిందో తెలుసా? తబ్లీగీ జమాత్ కు హాజరై... వైద్య పరీక్షలకు చేయించుకోని వారిపై మర్డర్ కేసులు పెడతామని ప్రకటించింది. దీంతో దెబ్బకు దిగొచ్చారు. ఆ సదస్సుకు రాష్ట్రం నుంచి హాజరైన 54 మంది బయటకు వచ్చి తమకు పరీక్షలు చేయండి, కరోనా ఉంటే చికిత్సలు చేయించుకుంటాం అని గవర్నమెంటును వేడుకున్నారు. ఆ రాష్ట్రం అంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం... అక్కడ నమోదైన 40 కేసుల్లో 30 కేసులు తబ్లిగీ ముస్లింలవే. ఉత్తరాఖండ్ తీసుకున్న నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా అందరూ ప్రశంసిస్తున్నారు. 

మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డలకు ఈ నిర్ణయం తీసుకునే దమ్ము ఉందా? సమాజానికి  హానికరంగా కరోనాతో దాక్కున్న వారిని కలుగుల్లోంచి బయటకు లాక్కొచ్చే దమ్ము ఉందా? మర్డర్ కేసు పెట్టేంత ధైర్యముందా? రాష్ట్రాన్ని అమాయకత్వంతోనో, తెలివితక్కువ తనంతోనో లేక దురుద్దేశంతోనో ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తున్న వారిని ఉత్తరాఖండ్ లా కఠిన నిర్ణయం తీసుకుని శిక్షించే దమ్ము ఈ రెండు రాష్ట్రాలకు ఉంటే బాగుండేదని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన చాలా రాష్ట్రాల్లో ఇంకా చాలా మంది ముస్లింలు.. తబ్లీగీ జమాత్ కు హాజరై కూడా వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదు. ఆ రాష్ట్రాలు కూడా ఉత్తరాఖండ్ లాగా నిర్ణయం తీసుకుంటే ఈ దేశం క్షేమంగా ఉంటుంది.  అన్ని రాష్ట్రాలు కూడా ఉత్తరాఖండ్ తరహాలోనే తబ్లీగీకి హాజరై బయటకు రాని వారిపై మర్డర్ కేసులు పెట్టేస్తామని ప్రకటిస్తే తప్పించి వారంతా బయటకు రారన్న వాదనలు జనంలో వినిపిస్తున్నాయి.