వలస కూలీ నిజాయితీ... వైరల్

August 04, 2020

వలస కూలీల సుదూర కాలి నడక ప్రయాణం ఈ దేశంలో ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోన్న విషయం తెలిసిందే. వందల కిలోమీటర్లు ఎర్రటి ఎండలో వారు నడుస్తూ వెళ్తుంటే ఆ దయనీయ పరిస్థితి ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. తాజాగా రాజస్తాన్లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. లాక్ డౌన్ ఇప్పట్లో తీసే పరిస్థితి కనిపించకపోవడంతో ఇక ఎలాగోలా ఇంటికి చేరదాం అని నిర్ణయించుకున్న ఒక కూలీకి వికలాంగుడైన ఒక కొడుకు ఉన్నాడు. తాను నడవడమే కష్టం. ఇక పిల్లవాడిని మోసుకుని ఎలా వెళ్లేది అని తీవ్రంగా మదనపడ్డాడు. 

ఈ క్రమంలో తీవ్రంగా ఆలోచించి ఆ వీధిలో ఉన్న ఒక సైకిల్ ను చోరీ చేశాడు. అయితే, సైకిల్ చోరీ చేసిన ఇంటి వద్ద ఒక చీటి రాసిపెట్టాడు. అందులో ఏముందంటే... ‘‘తాను ఇంటికి వెళ్లేందుకు మ‌రో మార్గం లేదని, తనకు ఓ కుమారుడు ఉన్నాడని, తన కుమారుడు వికలాంగుడని, నడవలేడని.. అందుకే సైకిల్ కొనడానికి అవకాశం కూడా లేక డబ్బల్లేక ఇలా చోరీ చేశాను క్షమించండి’’ అని చీటి రాసి పెట్టి వెళ్లాడు. తెలిపాడు.

కూలీ రాజస్తాన్ లోంచి భరత్ పూర్ నుంచి బరేలీ వెళ్లాల్సి ఉందట. రెండింటి మధ్య 300 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే, ఈ చోరీపై సైకిల్ యజమాని సహబ్ సింగ్ మానవీయతతో స్పందించాడు. తన సైకిల్ అవ‌స‌ర‌మైన‌ వారికి ఉప‌యోగ‌ప‌డినందుకు సంతోషంగా ఉందన్నారు. సైకిల్ తప్ప మరే వస్తువు చోరీ అవలేదని చెప్పాడు. 

అంతకష్టంలో కూడా ఆ కూలీ నిజాయితీ అందరి హృదయాల్ని కదిలించింది.