జగన్... అఖిలను చూడు, ఆమెకున్న బాధ్యత లేదా

February 19, 2020

రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇరుకున పెడుతోంది. తాజాగా ఆళ్లగడ్డ మండలంలోని గురుకుల పాఠశాలలలో  600 మంది విద్యార్థులు వరద నీరులో చిక్కుకున్నారు. స్థానికులు సాహసం చేసి కాపాడటంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. అధికారులకు సమాచారం ఇచ్చినా త్వరగా రాలేదు. అంతలోపు స్థానికులు అక్కడికి చేరుకుని విద్యార్థులను కాపాడారు.

రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాస్తవానికి అధికారులు ముందే హెచ్చరించి విద్యార్థులను అక్కడి నుంచి ఖాళీ చేయించాలి. కానీ ప్రభుత్వ అధినేతలకు అవగాహనలేదు. అడిగేవారు లేక అధికారులు పట్టించుకోవడం లేదు. చివరకు స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు. టీడీపీ లీడర్, మాజీ మంత్రి మహిళ అయిన భూమా అఖిల నడుము కంటే ఎక్కువ లోతున్న నీటిలో దిగుతూ వెళ్లి విద్యార్థులను కాపాడే సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

భూమా అఖిల సాహసానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ దృశ్యాలివి.