సీక్రెట్స్ - బిగ్ బాస్ -3 కంటెస్టెంట్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే

August 08, 2020

బిగ్ బాస్ మొదలైపోయింది. కొన్ని తెలిసిన మొహాలున్నాయి. ఇంకొన్ని తెలియని మొహాలున్నాయి. అయితే... వీరిలో చాలా మంది మొహాలైతే తెలుసు గాని వారి బ్యాక్ గ్రౌండ్ తెలియదు. మరి మేం చెబుతాం వింటారా? ఇక్కడ 15 మంది వివరాలు మీకోసం.

సావిత్రి అలియాస్ శివ‌జ్యోతి
వీ6 ఛాన‌ల్ లో ప్ర‌సార‌మ‌య్యే తీన్మార్ వార్త‌ల‌తో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితురాలు సావిత్రి అక్క‌. సీజ‌న్-3 తొలి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సావిత్రి.. గ‌డిచిన కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాలో ఫోక‌స్ పెట్టారు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న నేప‌థ్యంలో వీ6 ఛాన‌ల్ లో జాబ్ కు గుడ్ బై చెప్పిన‌ట్లుగా కొంద‌రు చెబుతుంటే.. కాదు.. కాదు లాంగ్ లీవ్ అని చెబుతున్నారు.
తెలంగాణ యాస‌లో వార్త‌లు.. ఇంట‌ర్వ్యూలు చేయ‌టంతో పాటు.. త‌న‌దైన సెన్సాఫ్ హ్యూమ‌ర్ తో మ‌న‌సుల్ని మ‌స్తుగా కొల్ల‌గొట్టే సావిత్రి ఎక్క‌డ ఉంటే.. అక్క‌డంతా హ‌డావుడే. మ‌రి.. బిగ్ బాస్ హౌస్ లో త‌న స‌త్తా చాటి.. విజేత‌గా నిలుస్తుందా? అన్న‌ది తేలాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.

ర‌వికృష్ణ‌
బుల్లితెర మీద ప్ర‌సార‌మ‌య్యే సీరియ‌ల్స్ ను బాగా ఫాలో అయ్యే వారికి సుప‌రిచితుడు ర‌వికృష్ణ‌. ప‌లు సీరియ‌ల్స్ లో న‌టించిన అనుభ‌వం ఉన్న ర‌వికృష్ణ బిగ్ బాస్ హౌస్ లో ఫైన‌ల్ వ‌ర‌కూ నిలిచి.. విజేత‌గా మార‌తారా? అన్న‌ది చూడాలి.

అషూ రెడ్డి
గ‌త సీజ‌న్ లో డ‌బ్ స్మాష్ కేట‌గిరిలో దీప్తి సున‌య‌న ప్లేస్ ను ఈసారి అషూ రెడ్డి అలియాస్ జూనియ‌ర్ స‌మంత భ‌ర్తీ చేసేలా ఎంట్రీ ఇచ్చింద‌ని చెప్పాలి. వీడియోల‌తో సోష‌ల్ మీడియాలో క్రేజ్ ఉన్న ఈ భామ‌.. బిగ్ బాస్ షోలో ఎంత‌వ‌ర‌కూ ఎంట‌ర్ టైన్ చేసి ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని దోచుకుంటుందో చూడాలి.

జాఫ‌ర్
టీవీ9 రిపోర్ట‌ర్ గా.. స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూలు చేసే పాత్రికేయుడిగా జాఫ‌ర్ సుప‌రిచితం. ప‌లు కాంట్రావ‌ర్సీ ప్ర‌ముఖుల‌తో త‌న‌దైన శైలిలో ఇంట‌ర్వ్యూలు చేయ‌టం.. ప్ర‌శ్న‌ల‌తో గిల్ల‌టం.. ఆ వెంట‌నే కాస్త క‌వ‌ర్ చేయ‌టం లాంటి చేష్ట‌ల‌తో బుల్లితెర మీద ఇప్ప‌టికే విన్యాసాలు చేసిన జాఫ‌ర్ బిగ్ బాస్ హౌస్ లో ఎంత‌లా రాణిస్తారో చూడాలి.

హిమ‌జ‌
సీరియ‌ల్స్.. సినిమాల్లో న‌టిస్తూ గుర్తింపు పొందిన హిమ‌జ‌.. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవ‌ల విడుద‌లైన స్పైడ‌ర్.. మ‌హానుభావుడు.. ఉన్న‌ది ఒకటే జింద‌గీ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన ఆమె సుప‌రిచితురాలే. మ‌రి.. హౌస్ లో ఉన్న ఇత‌ర కంటెస్టెంట్ల‌కు ఎలాంటి పోటీ ఇస్తారో చూడాలి.

రాహుల్ సిప్లిగంజ్
గాయ‌కుడిగా అంద‌రికి ప‌రిచ‌య‌స్తుడు.. ప‌క్కా హైద‌రాబాదీ రాహుల్ సిప్లిగంజ్. ప్ర‌తి సీజ‌న్లో ఒక సింగ‌ర్ ను త‌ప్ప‌కుండా ఉండేలా చూసుకునే బిగ్ బాస్ నిర్వాహ‌కులు.. ఈ సీజ‌న్ లో రాహుల్ ను ఎంపిక చేసిన‌ట్లుగా చెప్పాలి. ప్రైవేటు ఆల్బ‌మ్స్ తో ట్రెండింగ్ లో ఉంటున్న రాహుల్.. హౌస్ లో ఏ మేర‌కు అల‌రిస్తారో చూడాలి.

రోహిణి
రాయ‌ల‌సీమ యాస‌తో డైలాగ్ డెల‌వ‌రీ చేసే రోహిణి.. తాజా సీజ‌న్ కు ఎంపిక‌య్యారు. న‌టిగా సుప‌రిచితురాలు.. త‌న మాట‌తో.. యాస‌తో అంద‌రిని ఆక‌ట్టుకునే ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఎంత‌లా ఆక‌ట్టుకుంటారో చూడాలి.

బాబా భాస్క‌ర్
ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ గా సుప‌రిచితులు.. బుల్లితెర మీద నిర్వ‌హించే ప‌లు కార్య‌క్ర‌మాల్లో అల‌రించే ఈ త‌మిళ సినీ ప్ర‌ముఖుడు.. బిగ్ బాస్ హౌస్ లో ఎంత‌లా అల‌రిస్తారో చూడాలి. హుషారుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. తానున్న చోటును సంద‌డిగా మార్చే అల‌వాటున్న బాబా భాస్క‌ర్ బిగ్ బాస్ హౌస్ లో ఎంత‌వ‌ర‌కూ సాగుతారో చూడాలి. మ‌గ‌ధీర చిత్రంలో పంచ‌దార బొమ్మా పాట‌తో త‌న కెరీర్ కు ట‌ర్నింగ్ ఇచ్చుకున్న ఆయ‌న‌.. తాజాగా బిగ్ బాస్ షోలో ఎలాంటి క్రేజ్ ను సొంతం చేసుకుంటారో చూడాలి.

పున‌ర్న‌వి భూపాలం
సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్ని పోషిస్తూ.. టీవీ కార్య‌క్ర‌మాల్లో క‌నిపించే పున‌ర్న‌వి భూపాలం.. ఉయ్యాల జంపాల సినిమాలో జండూభామ్ గా ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌టం గుర్తుండే ఉంటుంది. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు సినిమాలో శ‌ర్వానంద్ కుమార్తె పార్వ‌తి పాత్ర‌లో అల‌రించింది. బిగ్ బాస్ హౌస్ లో ఎంత‌మేర రాణిస్తారో చూడాలి.

హేమ‌
సినీ న‌టిగా సుప‌రిచితురాలు.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఫైర్ బ్రాండ్ మ‌హిళ‌గా ఇమేజ్ హేమ సొంతం. ఇటీవ‌ల బాగా స‌న్న‌బ‌డిన‌ట్లుగా క‌నిపిస్తున్న ఆమె.. హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూనే అంద‌రి దృష్టిని త‌న మీద ప‌డేలా చేసుకున్నారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల్లో మాంచి జోష్ మీద క‌నిపించ‌ట‌మే కాదు.. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడే క్ర‌మంలో ఎక్క‌డా త‌గ్గ‌ని నైజం ఆమె సొంత‌మ‌న్న‌ట్లు ఉంటారు. బిగ్ బాస్ హౌస్ లో హేమ ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.

అలీరెజా
ధృవ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స్నేహితుడిగా పోలీస్ పాత్ర‌లో క‌నిపించిన రెజా.. త‌న సిక్స్ ప్యాక్ తో అల‌రించిన రెజా.. స‌రైన స‌క్సెస్ కోసం ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడు. తాజా బిగ్ బాస్ షోలో త‌న ఇమేజ్ ను మ‌రింత పెంచుకుంటాడా? కొత్త త‌ర‌హా క్రేజ్ ను సొంతం చేసుకుంటాడా? అన్న‌ది తేలాల్సి ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఎంత‌వ‌ర‌కూ వెళ‌తాడ‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్పాలి.

మ‌హేష్ విట్టా
సోష‌ల్ మీడియాను ఫాలో అయ్యే వారికి.. యూట్యూబ్ వీడియోల్ని ఎక్కువ‌గా చూసే వారికి మ‌హేష్ విట్టా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. సినిమాల్లో న‌టించి మంచి ఫాలోయింగ్ ఏర్ప‌ర్చుకున్న అత‌గాడు.. త‌న కామెడీ టైమింగ్ తో ఆక‌ట్టుకోవ‌టం తెలిసిందే. రాయ‌ల‌సీమ యాస‌తో అద‌ర‌గొట్టే మ‌హేశ్ విట్టాను రాయ‌ల‌సీమ యాస త‌న‌కు నేర్పించాల్సిందిగా నాగార్జున అడిగారు. పంచ్ ల మీద పంచ్ లు వేసే అల‌వాటున్న ఇత‌గాడు.. హౌస్ లో ఎంత‌లా రాణిస్తారో చూడాలి.

శ్రీ‌ముఖి
ప్ర‌ముఖ యాంక‌ర్ శ్రీ‌ముఖి ఎంట్రీపై కాస్త ఉత్కంఠ చోటుచేసుకుంది. బిగ్ బాస్ సీజ‌న్ 3లో ఆమె ఎంపికైన విష‌యం ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చార‌మైంది. అయిన‌ప్ప‌టికీ.. 13వ‌ కంటెస్టెంట్ గా ఆమె పేరును ప్ర‌క‌టించారు. అంత‌కు ముందు వ‌ర‌కూ.. త‌ర్వాత శ్రీ‌ముఖే అన్న మాట వినిపించినా.. ఆమె ఎంట్రీ కోసం కాస్త వెయిట్ చేయ‌క త‌ప్ప‌లేదు. ప‌టాస్ షోతో సుప‌రిచితురాలైన ఈ గుంటూరు జిల్లా చిన్న‌ది.. బుల్లితెర మీదే కాదు వెండి తెర మీద కూడా మెరిసారు. ఫుల్ బిజీగా ఉండే శ్రీ‌ముఖి.. బిగ్ బాస్ షో కోసం ప్ర‌త్యేకంగా త‌న ఫిట్ నెస్ మీద ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లుగా చెబుతారు. హౌస్ లోకి ఎంట్రీకి ముందే.. త‌న సైన్యాన్ని సిద్ధం చేసుకున్న ఆమె హౌస్ లో ఎంత‌వ‌ర‌కూ సాగుతారు? అన్న‌ది తేలాలంటే వెయిట్ చేయాల్సిందే.

వ‌రుణ్ సందేశ్‌.. వితికా షేరు
భాష ఏదైనా... బిగ్ బాస్ షోకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని ఒక ప్ర‌యోగాన్ని తాజా సీజ‌న్ లో చేశారు. ఒక రియ‌ల్ జంట‌ను.. హౌస్ లోకి పంపారు. ఒక‌ప్పుడు యూత్ స్టార్ గా క్రూజ్ సొంతం చేసుకున్న వ‌రుణ్ సందేశ్‌.. ఆయ‌న స‌తీమ‌ని వితికా షేరు.. తాజాగా జంట‌గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రియ‌ల్ లైఫ్ లో భార్య‌భ‌ర్త‌లైన వీరిద్ద‌రు వేర్వేరుగా ఆడ‌తారా? క‌లిసే ఆడతారా? అన్న‌ది క్వ‌శ్చ‌న్ మార్క్.
దీనికి త‌గ్గ‌ట్లే స్టేజ్ మీద వీరిని ప‌రిచ‌యం చేసే క్ర‌మంలో నాగార్జున ఆస‌క్తిక‌ర ప్ర‌శ్నను సంధించారు. ఫైనల్ కు మీరిద్ద‌రే ఉండి.. ఎవ‌రు గెల‌వాల‌నుకుంటార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు వితికా బ‌దులిస్తూ.. తాను గెల‌వాల‌ని అనుకుంటాన‌ని చెబితే.. వ‌రుణ్ మాత్రం వితికా గెలిస్తే బాగుంటుంద‌ని చెప్పారు. మ‌రి.. ఈ జంట చివ‌రి వ‌ర‌కూ సాగుతారా? లేదంటే.. మ‌ధ్య‌లో ఎలిమినేట్ అయి.. ఒక్క‌రే మిగులుతారా? అన్న‌ది తేలాలంటే కొంత‌కాలం వెయిట్ చేయాల్సిందే.