బిగ్ బ్రేకింగ్... లాక్ డౌన్ పొడగింపు

August 11, 2020

ప్రజలు ఊహించిందే జరిగింది. మహమ్మారి కట్టడికి లాక్ డౌనే ఉత్తమ మార్గమని కేంద్రం బలంగా ఫిక్సయ్యింది. మే 17వ తేదీ వరకు లాక్ పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాణాంతక వైరస్ ను నిలుపుదల చేయడం కోసం ఇప్పటికే లాక్ డౌన్ 1, లాక్ డౌన్ 2 పూర్తి చేసుకున్న కేంద్రం తాజాగా లాక్ డౌన్ 3కి తెరలేపింది. అధికారికంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పొడగిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడో దశ లాక్ డౌన్ పై మధ్యతరగతి వర్గం అంగీకారంతో ఉన్నా సంపన్నులు, పేదలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. అయినా కూడా అన్నిటికన్నా ఉత్తమ మార్గం లాక్ డౌన్ మాత్రమే అని కేంద్రం నిర్దారణకు వచ్చింది. మే 3న ముగియాల్సిన లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పెంచుతూ 17 వ తేదీ వరకు లాక్ డౌన్ ఉంటుందని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

దేశంలో ఆరు పెద్ద రాష్ట్రాల్లో లాక్ డౌన్ లో కూడా ఈ మహమ్మారి విజృంభించింది. పీక్ స్టేజికి ఇంకా చేరలేదు. తగ్గుముఖం పట్టడం మొదలైతే గాని లాక్ డౌన్ ను కేంద్రం ఆపేలా లేదు. తొలి విడత లాక్ డౌన్ లో అంతగా కరోనా ఉదృతి కనిపించలేదు. దీంతో ప్రభావం తగ్గిందనుకున్నారు. కానీ రెండో విడత లాక్ డౌన్ లో కరోనా విజృంభించింది. దీంతో రెండో దశ లాక్ డౌన్ గడువు ముగియడానికి రెండు రోజుల ముందే కేంద్రం మూడో విడత లాక్ డౌన్ ను ప్రకటించింది. దీంతో మూడో విడత లాక్ డౌన్ ఉంటుందా? ఉండదా? అంటూ పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చకు తెరదించింది.

 

ఆర్థిక రంగానికి తీవ్ర నష్టమని, లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తే మైనస్ అవుతుందని నిపుణులు చేసిన విశ్లేషణలు కేంద్రం పట్టించుకోలేదు. బహుశా అందువల్లే లాక్ డౌన్ పొడిగించే ముందే కూలీలను తరలించమని ఆదేశాలు జారీ చేసింది. ఆ పనిచేయకుండా పొడిగిస్తే ఎక్కడికక్కడ జనం రోడ్ల మీదకు వచ్చేవారు... రెండో లాక్ డౌన్ సమయంలో ముంబైలో ఘర్షణలు దృష్టిలో పెట్టుకుని కేంద్రం జాగ్రత్త పడింది.