​జగన్ సర్కారు ఆ 2 విషయాలు ఎందుకు దాస్తోంది?

June 01, 2020

ఏపీలో ఏం జరుగుతోందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రతిదీ రహస్యమే. చివరకు జీవోలు కూడా రహస్యమే. ముఖ్యంగా కోవిడ్ కు సంబంధించిన జీవోలు కూడా కొన్ని రహస్యంగా విడుదల చేశారు. ఎందుకిన్ని రహస్యాలో అర్థం కావడం లేదు. దీనిపై కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా ఆధారంగా జగన్ సర్కారు రెండు భారీ స్కాములు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్కాములు ప్రచారం కావడానికి అందరూ అనుమానిస్తున్న అంశాలపై ప్రభుత్వం దాపరికం వల్లే ఈ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఈ విషయం జగన్ సర్కారు బయటపెట్టకపోతే ఈ స్కాం నిజమే అని అర్థం చేసుకునే అవకాశం ఉంది ప్రజలు. ఇంతకీ ఏంటా స్కాములు?

మాస్కులు :

ఏపీలో 5 కోట్లమందికి పైగా ప్రజలకు మాస్కులు మనిషికి మూడు చొప్పున ఉచితంగా పంచమని జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దురదృష్టం ఏంటంటే... తొలి లాక్ డౌన్ కు ముందు ఇవ్వాల్సిన ఆదేశాలు ఇవి. 

జవనరి నుంచి కరోనా చర్చ దేశంలో జరుగుతోంది. మార్చి మొదటి వారం నుంచి ప్రతి ఒక్కరికి దీని గురించి తెలిసింది. కేంద్రం జాగ్రత్త చర్యలు మొదలుపెట్టింది. WHO అప్పటికే ఎమర్జన్సీ విధించింది. కానీ జగన్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. మన ఎన్నికలు మనం ఎపుడైనా పెట్టుకోవచ్చు. కానీ చైనీస్ వైరస్ ను రాకుండా తరిమికొట్టకపోతే అది దానంతట అది పోదు. జగన్ అన్నట్టు ఇట్ కమ్స్.. ఇట్ గోస్... కాదు... ఇట్ కమ్స్... బట్ మనమే తరిమేయాలి. కానీ ఎన్నికల బిజీలో ఉండి మాస్కుల గురించి జగన్ సర్కారు పట్టించుకోలేదు. అయితే.. విచిత్రంగా రెండో లాక్ డౌన్ ప్రకటించాక ఉచిత పంపిణీ తెరపైకి తెచ్చారు. ఇక్కడే కొన్ని అనుమానాలు వచ్చాయి. అసలు మాస్కులకు టెండరు పిలిచారా? వీటికి సర్కారు కేటాయించిన బడ్జెట్ ఎంత? టెండరు ఎవరికి ఇచ్చారు? వంద కోట్లకు పైన టెండరు వేస్తే ఒక కమిటీ ఆమోదించాలన్నారు. మరి ఇది ఎన్ని కోట్ల టెండరు? అసలు మాస్కులు ఎపుడు తయారుచేస్తారు? ఎపుడు పంచుతారు? వంటి ప్రశ్నలు జనం నుంచి వస్తున్నాయి. కానీ ఈ విషయాలపై సర్కారు నిజాలు బయటపెట్టడం లేదు. దీంతో ఇందులో వంద కోట్ల కంటే పెద్ద స్కాం జరుగుతోందని అందరూ అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి ఈ వివరాలు బయటపెడితే ఈ స్కాం అనుమానాలకు చెక్ పెట్టొచ్చు.

టెస్టింగ్ కిట్లు :

దక్షిణాఫ్రికా నుంచి... లక్ష కిట్లు తెప్పించామని జగన్ సర్కారు ఘనంగా ప్రకటించుకుంది. అదేదో శుభకార్యం లాగా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఆవిష్కరణ ప్రోగ్రాం పెట్టారు. మాస్కు, గ్లౌజు లేకుండా జగన్ కి టెస్టు కూడా చేశారు. కేంద్ర వైద్య శాఖతో చీవాట్లు కూడా తిన్నారు. ఇదంతా ఒకెత్తు. అయితే... ఏపీతో పాటు చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాలకు కొరియా నుంచి టెస్టు కిట్లు దిగుమతి అయ్యాయి. చ‌త్తీస్ గ‌డ్ మంత్రి టీఎస్ సింగ్ డియో ఒక ట్వీట్ ద్వారా ఈ కిట్ల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సౌత్ కొరియా నుంచి తాము ఒక్కో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ రూ.337 చొప్పున 75,000 కిట్లు తెప్పించామ‌ని పేర్కొన్నారు. దేశంలోనే ఇంత త‌క్కువ‌కు ఈ కిట్లు తెప్పించింది మేమేనంటూ గ‌ర్వంగా ప్ర‌క‌టించారు. ఇక్కడే పెద్ద మతలబు బయటపడింది. ఏపీ సర్కారు ఒక్కో కిట్ రూ.1200 చొప్పున ఖర్చు పెట్టి తెప్పించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏపీకి మాత్రం ఎందుకింత ఖరీదు అయ్యింది. అలా జరగదు కదా. అమ్మితే రెండు రాష్ట్రాలకు ఒకే రేటుకు అమ్ముతారు. దీనిపై కూడా ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదు. ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించకపోతే బయట ప్రచారం జరుగుతున్నట్లు 1200 కు ఒక కిట్ తెప్పించిన విషయం నిజమే అనుకోవాలి. ఆ లెక్కన ఆ 8 కోట్లు (లక్ష కిట్లకు 800 అదపు భారం చొప్పున) ఎవరి జేబులోకి వెళ్లాయి. 

ప్రభుత్వం అధికారికంగా ఈ రెండింటిపై వివరాలు వెల్లడించకపోతే .... జనంలో జరుగుతున్నట్లు ఈ స్కాములు చేసినట్లే జనం నమ్మే అవకాశం ఉంది. మంత్రి కొడాలి నాని చెప్పినట్లే ... నమ్మితే నమ్మనీ... మా బొచ్చేమైనా పీకుతారా అనుకుంటే మనమేం చేయలేం గాని... వచ్చే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ ఓట్లు వేయాలంటే మాత్రం ఈ స్కాములపై క్లారిటీ ఇవ్వాల్సిందే మరి.