టీడీపీ బిగ్ షాక్ - రాజ్యసభలో కలకలం

July 01, 2020

తెలుగుదేశం పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీలోకి మారతారు అని వార్తలు వస్తున్న నలుగురు తెలుగుదేశం రాజ్యసభ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ కు లేఖ ఇచ్చారు. మేము ఇక తెలుగుదేశం పార్టీలో కొనసాగడం లేదని వారు అధికారికంగా రాజ్యసభ చైర్మన్ అయిన వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చారు. తమకు వేరే గ్రూపుగా పరిగణించాలని చైర్మన్ ను కోరారు. ఇది ఆమోదం పొందితే రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం 6 నుంచ 2కు పడిపోతుంది. అంతేగాకుండా 2/3 సభ్యులు పార్టీ వీడినందున వీరు సులువుగా ఇతర ఏ పార్టీలో అయినా చేరే అవకాశం ఉంటుంది. 

రానున్న రోజుల్లో చంద్రబాబును దెబ్బతీయడానికి ఎంపీలపై సీబీఐ విచారణలు పెరుగుతాయని అందరూ భావిస్తున్న నేపథ్యంలో నలుగురు రాజ్యసభ ఎంపీలు ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం అయ్యింది. 2019 ఓటమితో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో పడిందని చెప్పొచ్చు. లేఖ ఇచ్చిన వారిలో ఎంపీలు సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌ ఉన్నారు.