మనం ఇలా పడుకుని ఉంటే ఈజీగా ట్రోల్స్ వస్తాయ్...

August 12, 2020

మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతున్న బిగ్ బాస్ సీజన్ 327 ఎపిసోడ్లు ముగించుకుని శనివారం 28 ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. శనివారం కింగ్ నాగార్జున అదిరిపోయే సాహో సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చి.. శుక్రవారం హౌస్ మేట్స్ చేసిన సందడిని మన టీవీ ద్వారా చూపించారు. మొదట మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్‌ తో నిద్రలేచారు. ఇక ఆ సాంగ్ కి బాబా భాస్కర్ నలుగురు మహిళా కంటెస్టంట్స్ తో కలిసి స్టెప్పులు ఇరగదీశారు. ఆ తర్వాత మహేశ్  ఫేస్‌కి నల్లటి క్రీమ్ పూసుకుని ఉండటంతో, బాబా భాస్కర్ ఆటపట్టించారు.
ఏంట్రా ముఖానికి పూసుకున్నావ్ అని బాబా అడుగగా.. నేను ఇంటర్మీడియట్ నుండి రాసుకుంటున్నా అని మహేష్ సమాధానమిచ్చాడు. దానికి బాబా రియాక్ట్ అవుతూ నేను చదివింది ఎనిమిది..నువ్ ఇంటర్ చదివానని చెబుతున్నావని సరదాగా అన్నారు. నేను చదివింది ఇంటర్ కాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటూ మహేశ్ ఆన్సర్ ఇచ్చారు. మరి అంత చదువుకుని నిన్న బిగ్ బాస్ అడిగిన జీకే ప్రశ్నలకు ఎందుకు ఆన్సర్స్ ఇవ్వలేకపోయావ్ అని బాబా భాస్కర్ ఒక సెటైర్ వేశారు. మిగతా వాటికి సమాధానం తెలుసుగాని నన్ను అడిగిన దానికి తెలియదని మహేశ్ కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడు.
వీరి ఎపిసోడ్ ముగియగానే పునర్నవి-రాహుల్ లవ్ ట్రాక్ మొదలైంది. లివింగ్ రూమ్ హల్లో ఒకే సోఫా మీద పడుకుని ఇద్దరు ముచ్చట్లు పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ లోపు రాహుల్ సడన్ గా లేచి కూర్చుని మనం ఇలా పడుకుని ఉంటే మనల్ని ట్రోల్ చేస్తారని అన్నాడు. దీంతో పునర్నవి లేచి బెడ్ రూమ్ లో పడుకుంటే నువ్వే పిలిచావ్ అంటూ రాహుల్ మీద ఫైర్ అయ్యి వేరే సోఫా మీద పడుకుంది. ఈలోపు వితిక వచ్చి పునర్నవిని టీ పెట్టమంది. పునర్నవి అలాగే పడుకుని ఉంటే వితిక ఎత్తుకునే ప్రయత్నం చేసి కింద పడేసింది. తర్వాత రాహుల్ ని ఎత్తుకోమని చెప్పింది. బాబోయ్ అలా ఎత్తుకుంటే ఇంట్లో వాళ్ళు మామూలుగా చూడరని చెప్పుకొచ్చాడు.