బిగ్ బాస్ విజేత ఎవరో చెప్పేసింది

August 15, 2020
CTYPE html>
బిగ్ బాస్ సీజన్ 3 చివరకు వచ్చేసింది. వంద రోజుల పాటు హౌస్ లో ఉండి.. తమ తీరుతో ప్రేక్షకుల మదిని దోచుకోవటం.. వారి నుంచి పడే ఓట్లతో విజేతగా నిలవటం తెలిసిందే. మరి.. ఈసారి ఎవరు విజేతగా నిలవనున్నారు? ఇప్పుడున్న ఐదుగురిలో అంతిమంగా విజేతగా నిలిచేది ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. బిగ్ బాస్ సీజన్ 3 విజేత మాత్రం తన భర్త వరుణ్ సందేశ్ అని చెప్పింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక ఇంటికి వచ్చిన వితిక శేరు ఒక మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె తన భర్త.. సినీ నటుడు వరుణ్ సందేశ్ విజేతగా నిలుస్తారని చెప్పింది.
హౌస్ లో ఉన్న వేళ తాను చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పిన వితికా.. ఓపిగ్గా ఉండటం అలవాటైందని.. కుదురుగా ఉండటం కూడా నేర్చుకున్నట్లు చెప్పింది. వరుణ్ సోలోగా ఆడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని.. అందుకే తాను ఎలిమినేట్ అయినట్లు చెప్పింది.
ఒకరి సాయం లేకుండా.. లగ్జరీ లేకున్నా.. ఒకరి సాయం తీసుకోకుండా.. గూగుల్ అవసరం లేకుండా బతకొచ్చన్న విషయం హౌస్ లో ఉన్న కారణంగా తనకు తెలిసిందన్నారు. ఇవే విషయాల్ని 90 రోజులు బిగ్ బాస్ హౌస్ లో తనతో పాటు తన భర్త వరుణ్ కూడా తెలుసుకున్నట్లు చెప్పింది. టాస్కుల్లో తన కంటే వరుణ్ చాలా బాగా ఆడేవారని చెప్పిన ఆమె.. హౌస్ లో నచ్చని వారంటూ ఎవరూ లేరని చెప్పింది.
హౌస్ లో ఉన్న కారణంగా ఇద్దరి మధ్య భార్యభర్తల బంధం మరింత పెరిగిందని చెప్పింది. వరుణ్ ఓపెన్ మైండెడ్ గా ఉండేవారని.. నిజాయితీ కనిపించిందన్న ఆమె.. తమ మధ్య ఎలాంటి గొడవలు వచ్చినా వాటిని దాటగలమన్న నమ్మకం బిగ్ బాస్ షోతో అర్థమైందన్నారు. ఇద్దరం బాగా అర్థం చేసుకున్నట్లు చెప్పిన వితిక మరో ఆసక్తికర విషయాన్ని చెప్పింది.
ఈ షోలో తనను అందంగా చూపించటానికి.. టాస్క్ లలో తన ఆటకు తగ్గట్లు డ్రెస్సులు తయారు చేయటానికి ముగ్గురు డిజైనర్లు పని చేశారన్నారు. రోజుకు మూడు డ్రెస్సలు మార్చేదానినని.. మొత్తంగా 250 డ్రెస్సులు మార్చినట్లుగా చెప్పింది. మరి.. వితిక చెప్పినట్లే బిగ్ బాస్ 3 విజేత వరుణే అవుతారన్నది తేలాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.