ఎంట్రీకోసం ’బిగ్ బాస్‘ దగ్గర పడుకోవాలా ?

August 07, 2020

వివాదాల‌తో స‌హ‌వాసం చేస్తూ ప్రేక్ష‌కుల అటెన్ష‌న్ ను మ‌రింత త‌న మీద ప‌డేలా చేసే రియాలిటీ షోగా బిగ్ బాస్ ను ప‌లువురు అభివ‌ర్ణిస్తుంటారు. టెలివిజ‌న్ రంగంలో ఎన్నో సంచ‌ల‌న కార్య‌క్ర‌మాలు ప్ర‌సార‌మైనా.. బిగ్ బాస్ అంత‌టి వివాదాస్ప‌ద షో మ‌రొక‌టి లేద‌న్న మాట త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. ఈ షో పుణ్య‌మా అని.. షోలోనే కాదు.. బ‌య‌టా త‌ర‌చూ వివాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.
తెలుగులో సీజ‌న్ త్రీకి సిద్ధ‌మ‌వుతూ.. ఈసారి ఈ షోకు ప్ర‌యోక్త‌గా టాలీవుడ్ మ‌న్మ‌దుడు నాగార్జున వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు విప‌రీతంగా ఆక‌ర్షిస్తున్నాయి. ఇలాంటి వేళ‌.. ఈ షోకు సంబంధించి పెద్ద బాంబునే పేల్చారు యాంక‌ర్ క‌మ్ జ‌ర్న‌లిస్ట్ శ్వేతారెడ్డి. బిగ్ బాస్ షోకు త‌న‌ను ఎంపిక చేసిన‌ట్లుగా సమావేశాలు.. సంత‌కాల కార్య‌క్ర‌మాల్ని చేయించిన స్టార్ మా యాజ‌మాన్యం.. చివ‌ర్లో ఆ చాన‌ల్ కు చెందిన ఒక‌రు త‌మ బాస్ ను ఎలా సంతృప్తిప‌రుస్తామంటూ అడిగిన తీరుపై ఆమెఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ షోలో పాల్గొనాలంటే వాళ్ల బాస్ ను ఇంప్రెస్ చేయాలంటున్నార‌ని.. ఇదెక్క‌డి ద‌రిద్రం? అని ఆమె ఫైర్ అవుతున్నారు. ఉత్త‌రాది గ‌బ్బు సంస్కృతిని తెలుగువాళ్ల‌పై రుద్దాల‌ని అనుకుంటున్నారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బిగ్ బాస్ 3ను నిషేధించాల‌ని.. తెలుగు టీవీ నుంచి ఈ కార్య‌క్ర‌మాన్ని వెలివేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. అంతేనా.. అంత‌కు మించిన భారీ విమ‌ర్శ కూడా చేశారు.
బిగ్ బాస్ ముసుగులో నిర్వాహ‌కులు బ్రోత‌ల్ హౌస్ న‌డుపుతున్నారా? అంటే నిప్పులు చెరిగారు. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో బిగ్ బాస్ కార్య‌క్ర‌మానికి త‌న‌ను ఎంపిక చేసిన‌ట్లుగా ఫోన్ ద్వారా చెప్పి త‌ర్వాత సంత‌కాలు చేయించుకున్నార‌ని.. ఈ సంద‌ర్భంగా త‌న‌కు సంబంధించిన డాక్యుమెంట్ల‌ను తిరిగి ఇవ్వ‌టం లేద‌ని ఆమె ఆరోపిస్తున్నారు. షో కు మిమ్మ‌ల్ని ఎందుకు తీసుకోవాలి? మా బాస్ ని ఎలా ఇంప్రెస్ చేస్తారంటూ బిగ్ బాస్ షో ప్రొడ్యూస‌ర్ శ్యామ్ అడిగిన‌ట్లుగా ఆరోపించారు.
తాను లేవ‌నెత్తిన అంశం మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వానికి సంబంధించింద‌ని.. తాను బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడ‌టం మొద‌లు పెట్టిన త‌ర్వాత ప‌లువురు బాధితులకు ఇలాంటి అనుభ‌వ‌మే త‌న‌కు తెలిసింద‌న్నారు. బిగ్ బాస్ 3 తెలుగు మీద గ‌తంలో ఎప్పుడూ రానంత సీరియస్ ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో ఏమ‌వుతుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.