లండన్  బతుకమ్మ,  దసరా సంబరాల రికార్డు

October 14, 2019
CTYPE html>
బతుకమ్మ ఉత్సవం... ఖండాంతరాలు దాటింది. ఒకప్పుడు తెలంగాణలోనే గట్టిగా చేయని ఈ పండగ... తెలంగాణ ఏర్పాటు అనంతరం కేవలం తెలంగాణ మాత్రమే కాదు... ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ వారు ఎక్కడ ఉంటే అక్కడ వైభవంగా జరుగుతోంది. ఎన్నారైలు ఈ పండగను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా లండన్ లో పెద్ద ఎత్తున స్థిరపడిన తెలంగాణ ఎన్నారైలు తాజాగా రికార్డు సృష్టించారు. తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యం లో  లండన్ బతుకమ్మ, దసరా సంబరాలు  ఘనంగా నిర్వహించారు. ఈసారి నిర్వహించిన ఉత్సవం ‘‘యూరోప్ లోనే  అతిపెద్ద  బతుకమ్మ’’ గా నిర్వహకులు పేర్కొన్నారు. పాతిక మంది ఒక ఫంక్షనుకు రావడమే అద్భుతం అనుకున్న పాశ్చాత్య దేశంలో ఏకంగా 3000 మందికి పైగా తెలంగాణ ఎన్నారైలు పాల్గొని బతుకమ్మ ఆటను విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా  విచ్చేసిన ఎమ్మెల్సీ  రాం చందర్ రావు  మొదట దుర్గా అమ్మవారి పూజ లో పాల్గొన్నారు. దీంతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఇండియా నుంచి ప్రత్యేకంగా  తెచ్చిన  జమ్మి  చెట్టు కు  పూజ నిర్వహించి  అనంతరం బతుకమ్మ ఆట, కట్టే కోలాటం ఆడారు. కనుల విందుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నారైలో ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

ఎటువంటి ఆధునిక పోకడలకు వెళ్లకుండా సంప్రదాయ విధానంలో బతుకమ్మ పండగ నిర్వహించారు. డిజె  ల జోలికి వెళ్లలేదు. పూర్తి స్థాయి లో  సాంప్రదాయ బద్దంగా జరిగిన బతుకమ్మ వేడుక విశేషంగా నిర్వహించారు. ముఖ్య  అతిథి ఎమ్మెల్సీ  రాంచందర్  రావు  మాట్లాడుతూ   భారతీయ  సంస్కృతి సంప్రదాయాలు కలకాలం నిలవాలని  భావి  పౌరులకు  సంప్రదాయాలు,  మాతృ దేశం మూలాలు  తెలిపే  కార్యక్రమాలు  నిర్వహిస్తున్న  ఎన్నారై  సంఘాలకు  అభినందనలు  తెలిపారు. ప్రకృతిని పూజించే  పండుగ  చేసుకోవడం  తెలంగాణ  సంస్కృతికి  చిహ్నం అన్నారు.
మరో ముఖ్య అతిథి భారత  రాయబారి  కార్యాలయం  ఉన్నతాధికారి శ్రీ  మనమీత్  నరాంగ్  మాట్లాడుతూ   సౌత్  ఇండియా  అతిపెద్ద ఫ్లోరల్ ఫెస్టివల్ ను ఇంత  పెద్దగా  చూడటం మొదటి సారి అన్నారు. పువ్వుల  పండుగ  చేస్తారని  తెలిసినప్పుడు ఆ కనుల విందైన వేడుకకు కుటుంబంతో వచ్చానన్నారు. ముఖ్య అతిథి విచ్చేసిన  లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ  భారతీయ సాంప్రదాయాలు కాపాడాల్సిన  బాధ్యత ఎన్నారై ల పైన ఉందన్నారు. ఏడేళ్లుగా  బతుకమ్మ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు తెలంగాణ కు ధన్యవాదాలు తెలిపారు.
అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ అంతటి మాట్లాడుతూ  యూరోప్ లోనే  అతి పెద్ద బతుకమ్మ వేడుక నిర్వహణ బాధ్యత కు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. 2010 లో  నిర్వహణ ఎలా చేయాలో ఎక్కడ చేయాలో ఆర్ధిక వనరులు ఎలా సమకూర్చాలో తెలియని  సమయం లో  యూరోప్ లోనే మొట్ట మొదటి బతుకమ్మ కు వేడుకకు పునాదులు వేసి నిర్వహించిన  తెలంగాణ ఎన్నారై ఫోరమ్  వ్యవస్థాపకుడు గంప వేణుగోపాల్ ను అభినందిస్తూ  2012  లో బ్రిటన్ లో వివిధ ప్రాంతాల్లో  ఊరూరా బతుకమ్మ నిర్వహించి  బతుకమ్మ భావజాలాన్ని చాటుతూ   ప్రతి తెలంగాణ బిడ్డ  బతుకమ్మ ఆట లో పాల్గొనే స్థాయి కి చేరుకుందని అన్నారు.
ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ   2017 నుంచి  ప్రతి  సంవత్సరం  అతిపెద్ద బతుకమ్మ నిర్వహిస్తూ ఈసారి చరిత్ర తిరగరాసి  అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి చరిత్ర సృష్టించిన ఘనత తెలంగాణ ఎన్నారై  ఫోరమ్  సభ్యులదేనని  అన్నారు. వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్  ,ప్రధాన  కార్యదర్శి   రంగు వెంకట్ , కార్యదర్శి పిట్ల భాస్కర్ , అడ్వైసరి సభ్యులు డా  శ్రీనివాస్ ,  మహేష్ జమ్ముల , వెంకట్ స్వామి , బాలకృష్ణ రెడ్డి , మహేష్ చాట్ల ,శేషు అల్లా , వర్మా , స్వామి ఆశా , అశోక్ మేడిశెట్టి , సాయి మార్గ్ ,వాసిరెడ్డి సతీష్ రాజు కొయ్యడ, నర్సింహారెడ్డి  నల్ల  వేడుకలు విజయవంతం చేయడంలో భాగస్వామ్యులయ్యారు.
మహిళా విభాగం తరఫున మీనా అంతటి, వాణి అనసూరి, శౌరి గౌడ్, సాయి లక్ష్మి, మంజుల, ,జయశ్రీ , శ్రీవాణి మార్గ్ ,  సవిత జమ్మల, దివ్యా, అమృత, శిరీషా  ఆశ , ప్రియాంక,  రోహిణి లు బతుకమ్మ నిర్వహణ లో కీలక పాత్ర పోషించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బతుకమ్మ  ఆట,  కట్టే  కోలాటం  ఆడి  అనంతరం నిమజ్జనం చేసిన తర్వాత అందరికి  విందు ఏర్పాటు చేశారు.

Read Also

అమెరికాలో కాల్పులు ఆగట్లేదు.. ఈ సారి నలుగురు
మీట్ అండ్ గ్రీట్ విత్ పోచారం... టాక్ ఈవెంట్ కు పోటెత్తిన ఎన్నారైలు
అవినీతి  పై శివాజీ ఆవేదన