భారతదేశపు అత్యంత అమానవీయ ఘట్టం 

August 11, 2020

ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలను నిర్వహించడంలో భారత దేశానికి దశాబ్దాల అనుభవం ఉంది. అందువల్ల సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో కేంద్రం అసాధారణమైన అధికారాలను విపత్తు సమయంలో సొంతం చేసుకుంది. కానీ కీలకమైన చరిత్రలోనే అరుదైన ఒక విషయంలో మోడీ సర్కారు నిర్లక్ష్యం మోడీ మీద పెద్ద మచ్చను వేసింది. ముఖ్యంగా వలస కార్మికుల విషయంలో మోడీ సర్కారు ఘోరంగా విఫలమైందని ప్రతి భారతీయ పౌరుడు బాధపడుతున్నాడు.

తాను సరిగా పట్టించుకోకుండా, పూర్తిగా రాష్ట్రాలను ఆదేశించకుండా తనంతట తాను తవ్వుకున్న అయోమయపు గొయ్యిలో కేంద్రం పడిపోయింది. ఫలితంగా అనిర్వచనీయమైన మానవతా సంక్షోభం ఏర్పడింది. కోట్ల మంది పేద భారతీయులు రోడ్ల మీద అనాథలుగా నడిచారు. వందలు, వేల కిలోమీటర్లు నడుస్తూ ప్రమాదకర స్థితిలో ఇంటికి చేరుకున్నారు. వీరిలో లక్షల మంది ఖాళీ కడుపుతో నడిచారు. దాహంతో మరణాలు సంభవించడం చరిత్రలో ఘోరమైన విపత్తు. ఇక దారిలో జరిగిన ప్రమాదాల్లో 170 మందికి పైగా మరణించారు. ఇది భారతదేశపు అత్యంత విషాదకరమైన, ప్రభుత్వం సిగ్గుపడదగిన సంఘటన.

1947 విభజన తరువాత భారతదేశంలో కనిపించిన అత్యంత ఘోర సంక్షోభం, అమానవీయ ఘటన ఈ వలస ప్రయాణమే. ఇందులో మోడీ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి ఆరు కారణాలు ఇక్కడ ఉన్నాయి.

1.  కేవలం నాలుగు గంటల నోటీసు తో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. 

2. చిక్కుకుపోయిన కార్మికులకు ప్రభుత్వం పెద్దగా సహాయం చేయలేదు. 

3. ఇది రైళ్లను పున:ప్రారంభించింది, కాని సొంతంగా సమన్వయం చేసుకోవాలని రాష్ట్రాలను కోరింది. 

4. శ్రామిక్ రైళ్ల  ఆలోచన చాలా ఆలస్యంగా చేయడం.

5. వేదనలో ఉన్న నిరాశ్రయులైన కార్మికుల నుండి ఛార్జీలను తీసుకునే ప్రయత్నం చేసింది.

6. రైళ్లు ప్రారంభించాక కూడా నడుచుకుంటూ వెళ్తున్న వారిని పట్టించుకుని ఆపే ప్రయత్నం చేయలేదు.