నువ్వు ఆపితే... డబ్బులు నేనిస్తా అని కోట్లు ఇచ్చాడు

August 05, 2020

బిల్ గేట్స్ ను WHO కి నిధులు ఆపేసిన నిర్ణయం బాగా హర్ట్ చేసిందని నిన్న ఆయన స్పందన బట్టి అర్థమైపోయింది. ట్రంప్ ను గట్టిగా తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఒకరోజంతా దీనిపై ఆలోచించిన బిల్ గేట్స్ ఒక నిర్ణయం తీసుకన్నారు. గతంలో 100 మిలియన్ డార్లు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ తరఫున ఇచ్చిన బిల్ గేట్స్ తాజగా మరో 150 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించి సంచలనం సృష్టించారు.

బిల్ గేట్స్ తాజా నిర్ణయం ట్రంప్ కి కోపం తెప్పించేలా ఉంది. అయినా అదేమీ గేట్స్ పట్టించుకోవడం లేదు. WHO బలంగా ఉంటేనే ప్రపంచానికి మంచిదని, కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో WHO సక్సెస్ కాగలదు అన్ని నమ్ముతున్నట్టు మిలిండా గేట్స్ వ్యాఖ్యానించారు. 

అమెరికా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థకు డబ్బులు విరమించుకోవడం ప్రమాదకరమైన నిర్ణయం అని మరోసారి ఈ దంపతులు వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా అమెరికా ప్రభుత్వం ఆపడం వల్ల ఏర్పడిన లోటును పూడ్చడం కష్టమని, ప్రభుత్వం ఇంకోసారి ఆలోచించి WHO కి నిధులు ఇవ్వాలని కోరారు.