కోటీశ్వరులైన నటులకు కరోనా ఎలా వస్తోంది?

August 08, 2020

సాధారణ జనం అయిన మనమే కరోనా రాకుండా జాగ్రత్త పడగలుగుతున్నాం. కానీ కోటీశ్వరులైన అమితాబ్, ఐశ్వర్యరాయ్ వంటి వారికి కోవిడ్ ఎలా సోకుతోందబ్బా? అని జనం అందరూ ఆశ్చర్యపోతున్నారు. వారు ఎంత ఖర్చుపెట్టయినా జాగ్రత్తలు తీసుకోగలరు కదా. అయినా ఎందుకు విఫలం అవుతున్నారనేదే అందరి సందేహం. దీనికి బిపాసా బసు చక్కటి సమాధానం కనిపెట్టారు.

వరుస లాక్ డౌన్లు ముగిసిన తర్వాత జాగ్రత్తలతో షూటింగులు చేసుకోవడానికి దాదాపు అన్ని రాష్ట్రాలు అనుమతి ఇచ్చాయి. వాస్తవానికి షూటింగులు చేసుకునే పరిస్థితులు లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా వారి ఉపాధిని దృష్టిలో పెట్టుకుని అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నటించేటపుడు మాస్కులు పెట్టుకుని నటించడానికి కుదరదు. తీసేయాల్సిందే. అలా అని యూనిట్ కి వచ్చే లైట్ బాయ్ నుంచి టీ బాయ్ వరకు అందరికీ టెస్టులు చేయలేరు.

ఈ నేపథ్యంలో యాక్టర్లకే కరోనా సోకడంపై బిపాసా స్పందించారు. కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు యాక్టర్లకు ఎక్కువగా ఉంటాయని ఆమె తెలిపింది. యూనిట్ లోని ఇతరులందరూ పీపీఈ కిట్లు, గ్లవ్స్, మాస్కులు, షీల్డులను ధరిస్తారని... అయితే యాక్టర్లు మాత్రం ఎలాంటి రక్షణ లేకుండా నటించాల్సి ఉంటుందని చెప్పింది. అందుకనే యాక్టర్లు కరోనా బారిన పడుతున్నారని బిపాసా చెప్పుకోచింది. ఆమె చెప్పింది అక్షరాలే నిజమే. కరోనా రాకూడదు అంటే షూటింగ్ మానేయడం ఒక్కటే మార్గం.