ఎన్డీయేకి జై కొట్టిన ఉద్యోగులు

July 13, 2020

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు దేశ వ్యాప్తంగా పూర్తయింది. ఈ ఓట్లలో ఎన్డీయే ముందంజలో ఉంది. ఉద్యోగులు మోడీ వైపు మొగ్గు చూపారు. హాజరు, డిజిటలైజేషన్ వల్ల ఇబ్బందులు పడినా ఉద్యోగులు ఎన్డీయే వైపు ఉండటం ఆశ్చర్యమే. 

రాహుల్ గాంధీ, రాజ్ నాథ్ సింగ్ అత్యధిక మెజార్టీతో లీడ్ లో ఉన్నారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో హిందు ఓట్లు బీజేపీకి పడటంతో ఒక్కసీటు కూడా గెలవని ఈ రాష్ట్రంలో లీడ్ లో కనిపించడం విశేషం.

దేశ వ్యాప్తంగా బీజేపీ కూటమి 217 చోట్ల లీడ్ లో ఉండగా కాంగ్రెస్ కేవలం 65 స్థానాల్లో ఇప్పటివరకు లీడ్ లో ఉంది. తమిళనాడులో డీఎంకే లీడ్ లో ఉంది.