జగన్ తప్పు... బీజేపీ బిక్షాటన

February 20, 2020

సకల ప్రజల సంక్షేమమే పాలకుడి బాధ్యత, లక్షణం. ఏ ఒక్క వర్గానికోసమో పాలకుడు పనిచేయకూడదు. తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పులకు కూడా బాధ్యత వహించేవాడే నిజమైన పాలకుడు. కానీ ఏపీలో పరిస్థితి వేరు. అర్ధంతర హఠాత్తు నిర్ణయాల వల్ల ఏపీ ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. జగన్ రావాలి, కావాలి అని నినదించిన కార్మిక వర్గమే జగన్ కు శాపాలు పెడుతోంది నేడు.

ఇసుక పాలసీ, మద్యం పాలసీ వల్ల ఏపీ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్యాన్ని పక్కన పెడితే ఇసుక పాలసీ అర్ధంతరంగా రద్దు చేసి కొత్త పాలసీ ఆలస్యంగా ప్రకటించడం, సర్వాధికారాలు అనధికారికంగా తన పార్టీ వారికి కట్టబెట్టడంతో రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో కోటి మంది దీనివల్ల ప్రభావితమయ్యారు. లక్షలాది మంది కూలీ కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పు పట్టినా, హెచ్చరించినా ముఖ్యమంత్రి జగన్ అసలు పట్టించుకోలేదు. 

ఇప్పటికే చంద్రబాబు అనేక సార్లు దీనిపై ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పరిస్థితిని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ ్ కూడా మధ్యలో దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయినా జగన్ పట్టించుకోలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల సర్వం కోల్పోయి ఉపాధి లేక పస్తులుంటున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి బీజేపీ బిక్షాటన కార్యక్రమం నిర్వహించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర పార్టీ నేతలు గుంటూరులో బిక్షాటన చేశారు. ప్రభుత్వాన్ని నిలదీశారు.

Read Also

చంద్రబాబు ఇలా చేసి ఉంటే... ఎంత రచ్చ చేసేవారో
గ్రామ వాలంటీర్లకు జగన్ మార్క్ దసరా కానుక
జగన్‌పై సీరియస్ కామెంట్లు చేసిన వైసీపీ ఎమ్మెల్యే