కశ్మీర్ టు తెలంగాణ - బీజేపీ వ్యూహం

December 07, 2019

కేసీఆర్ యాగాలు చేస్తారు. యజ్జాలు చేస్తారు. తానే అసలైన హిందువు అని చెప్పుకుంటారు. కానీ... ఆయన ఎంఐఎం దోస్తీ మాత్రం వదలరు. దానికోసం ఎంఐఎం మనుషులు ఏమైనా అరాచకాలు చేసినా క్షమిస్తారు. హైదరాబాదులో ముస్లింల పట్ల కేసీఆర్ ప్రభుత్వం సానుకూలతతో ఉంది. దీని ఆధారంగా చేసుకుని బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుతో దేశ వ్యాప్తంగా పాజిటివిటీ సంపాదించుకున్న బీజేపీ ముఖ్యంగా తెలంగాణ వంటి ముస్లిం ప్రభావిత రాష్ట్రాల్లో బలపడేందుకు ప్రయత్నం చేస్తోంది.

ఇంతకాలం బీజేపీని విమర్శించిన వారు కూడా కశ్మీర్ అంశంతో బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని వాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణ, కశ్మీర్ లకు ఒక సంబంధం ఉంది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు భారత్ లో స్వాతంత్ర్యం పొందని ప్రాంతాల్లో కశ్మీర్, హైదరాబాదు రెండూ ఉన్నాయి. ఇద్దరు భారత్ లో కలవడానికి ఆనాడు ఒప్పుకోలేదు. బలప్రయోగంతో అప్పట్లో హైదరాబాదు కలిపేశారు. కశ్మీరీ అయిన నెహ్రూ విధానం వల్ల జమ్ముకాశ్మీర్ స్వతంత్రంగా ఉండిపోయింది. ఇపుడు అది కూడా పూర్తిగా భారత్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం దోస్తీ కోసమే కేసీఆర్ తెలంగాణ విమోచన దినం అధికారికంగా చేయడం లేదని విమర్శలు చేసి టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. గతంలో హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసిన ఘటన సర్దార్ పటేల్‌కు దక్కితే... కాశ్మీర్‌ను పూర్తిస్థాయిలో భారత్‌లో విలీనం చేసిన ఘనత బీజేపీకి, మోదీ షాలకు దక్కుతుందని ఆ పార్టీ నేతలు ప్రచారం చేయనున్నారు. అందుకే ఈసారి విమోచన దినోత్సవాన్ని అదేపనిగా ప్రచారం చేసి కేసీఆర్ ను ఇరుకున పెట్టే ప్రణాళకి రచిస్తోంది బీజేపీ.
ముఖ్యంగా తెలంగాణకు చెందిన ఎంఐఎం పార్టీ కాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించినా ఆ పార్టీతో టీఆర్ఎస్ జట్టుకడుతోందనే విషయాన్ని జనాలకు గట్టిగా చేరవేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. కాశ్మీర్ నేపథ్యంలో ఈ ప్రచారం పనిచేస్తుందన్నది బీజేపీ నమ్మకం. 

Read Also

ఆయనే కాంగ్రెస్ కు రాజీనామా... ఊహించగలమా ఇది?
వరంగల్ చైల్డ్ రేప్ - ఊరిశిక్ష వేసిన కోర్టు !!
కాళేశ్వరం తిప్పి పోతల పథకం .. పరువు మటాష్ !!