ఈ ఛాలెంజ్ ను ఒప్పుకునే దమ్ము కేసీఆర్ కు లేదు

July 09, 2020

మొన్న కేటీఆర్... బీజేపీ దేశభక్తి గురించి కొన్ని చిలుకపలుకులు పలికారు. ఆయన న్యాయం గురివింద గింజ లాగే ఉంది. ఆయన మాటల దెబ్బకు కేసీఆర్ కి అసలైన ఛాలెంజ్ విసిరింది బీజేపీ. ఇంతకీ కేటీఆర్ ఏమన్నాడు. బీజేపీ వేసిన కౌంటర్ ఛాలెంజ్ ఏంటో చూద్దాం.

కేటీఆర్ -

‘‘దేశంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. తనతో ఉన్నవాళ్లే దేశభక్తులు, మిగతా వాళ్లంతా దేశద్రోహులు అన్నట్లు బీజేపీ ప్రవర్తిస్తోంది. ఇది న్యాయం కాదు’’

దీనికి తెలంగాణ బీజేపీకి బుల్లెట్ వంటి ఛాలెంజ్ ను విసిరింది. కేటీఆర్ చరిత్ర తెలుసుకో అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ టీఆర్ఎస్ పార్టీ నాయకులపై నిప్పులు చెరిగారు. మీరు పదమూడేళ్లు ఏం చేశారో గుర్తుతెచ్చుకుని ఆ తర్వాత మాట్లాడండి అని అన్నారు.  టీఆర్ఎస్ తో ఉంటే తెలంగాణ వాదులు, లేకపోతే ఆంధ్రా తొత్తులు అంటూ మీరు విమర్శలు చేసినపుడు మీ బుద్ధి ఏమైంది. ఏం మీతో లేకపోతే తెలంగాణ వాదులు కాకుండా పోయారా? అని బీజేపీ మండిపడింది. అంతేకాదు, టీఆర్ఎస్ కు ఒక సవాల్ విసిరింది. దానిపై కేసీఆర్ గాని, కేటీఆర్ గాని ఒప్పుకునే సాహసం కూడా చేయలేని ఛాలెంజ్ ఇచ్చింది బీజేపీ.

బీజేపీ ఛాలెంజ్ :

'బీజేపీపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న టీఆర్ఎస్ నేతలు ఒవైసీ బ్రదర్స్ తో భారత్ మాతా కీ జై అని అనిపించగలరా? కేసీఆర్ కు మజ్లిస్ ను నియంత్రించగల ధైర్యం ఉందా?

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇకనైనా శ్రీరంగనీతులు వల్లించడం మానుకోవాలని హితవు పలికారు. వారు చేసింది న్యాయం. మేము చేస్తున్నది అన్యాయమా? సంస్కారంతో గతంలో చేసిన పనులు ఒకసారి తిరిగి చూసుకుంటే మీకు మీరే మీరు సిగ్గుపడతారు. కానీ బీజేపీ చరిత్ర తవ్వితే ప్రతిదీ గర్వంగా చెప్పుకునే ఘటనలు తప్ప ఏమీ ఉండవన్నారు. 

 

Read Also

జ‌గ‌న్‌ను న‌మ్మినందుకు నిండా మునిగాడా...!
జగన్ అమెరికా టూర్.. ఎన్నారై సంఘాల అత్యుత్సాహం
ఆయనే కాంగ్రెస్ కు రాజీనామా... ఊహించగలమా ఇది?