సర్వేలన్నీ కేజ్రీవాల్ వైపు, ఐనా గెలుస్తామని బీజేపీ నేత ధీమా

August 14, 2020
CTYPE html>
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం రానున్నాయి. గత ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 సీట్లు గెలుచుకున్న కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ యాభైకి పైగా సీట్లు గెలుచుకుంటుందని, నాడు 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు ఇరవై వరకు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. దాదాపు అన్ని సర్వేలు కూడా ఏఏపీకి 48 నుండి 63 లేదా అంతకు మించి వస్తాయని జోస్యం చెప్పాయి. బీజేపీకి 5 నుండి 23 వరకు వస్తాయని పేర్కొన్నాయి. టైమ్స్ నౌ మాత్రం ఏఏపీకి 47, బీజేపీకి 23 సీట్లు వస్తాయని పేర్కొంది.
ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నాయి. కానీ బీజేపీ నేత కపిల్ మిశ్రా మాత్రం తమ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఫలితాలకు ఒకరోజు ముందు.. ఈ రోజు ట్వీట్ చేశారు. ప్రజలు కమలం వైపు ఉన్నారని, తాము కిందిస్థాయి నుంచి బాగా పని చేశామన్నారు.
నేను ఒకటి చెప్పదలుచుకున్నానని, న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయినా ఆశ్చర్యం లేదని ఆసక్తికర వ్యాక్యలు చేసారు. ఫలితాలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల కమిషన్, ఈవీఎంల వైపు వేలు చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు విషయం ఏమంటే వారికి ఢిల్లీ ప్రజలు ఎటువైపు ఉన్నారో అర్థమైందన్నారు. అందుకే ఈవీఎంలు, ఎన్నికల కమిషన్ వైపు వేలు చూపిస్తున్నారన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు బీజేపీకి ఓటు వేశారని, కమలం పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని కపిల్ మిశ్రా అన్నారు. గత రెండు ఎన్నికల్లోను బీజేపీ ఓటు బ్యాంకు దాదాపు సురక్షితంగా ఉంది. కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు తిరగడంతో కేజ్రీవాల్ భారీ విజయం సాధించారు. ఈసారి కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు మళ్లీ కేజ్రీవాల్‌కే పడ్డాయని అంటున్నారు.