అమరావతి విషయంలో బీజేపీ షాకింగ్ డెసిషన్ ??

February 26, 2020

అమరావతిపై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందా అని అందరూ డైలమాలో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెల రోజులుగా ఏపీలో అమరావతి రచ్చ రచ్చ అవుతున్నా... కేంద్రం నుంచి ఏ స్పందన లేదు. బీజేపీలో చాలామంది అమరావతే ఉండాలని మొదట్నుంచి అంటున్నారు గాని కొందరు జగన్ ఆలోచనకే మద్దతు పలికారు అయితే.. తాజాగా ఏపీ బీజేపీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ రాష్ట్ర శాఖ ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా అది కచ్చితంగా అధిష్టానం నోటీసులో లేకుండా, జాతీయ బీజేపీ ఆలోచనలకు విరుద్దంగా తీసుకోదు.

అమరావతిపై తాజాగా ఏపీ బీజేపీ శాఖ ... ఏపీ రాజధాని అమరావతియే అంటూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. వారు అంత ఘంటాపథంగా బహిరంగ తీర్మానం చేశారంటే.. కచ్చితంగా కేంద్రం నుంచి అమరావతి ఎక్కడికిపోదు అని హింట్ వచ్చినట్లే అనుకోవాలి. బీజేపీ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ తీర్మానంలో ఏముందంటే... ’’సీడ్ క్యాపిటల్ సచివాలయం, రాజ్ భవన్, అసెంబ్లీ, సీఎంవో సహా కీలక విభాగాలన్నీ అమరావతి నుంచే పని చేయాలి‘‘ అని తీర్మానం చేశారు. అంతేకాదు... ఈ తీర్మానాన్ని ఫిజికల్ గా కూడా అమలు చేయడానికి బీజేపీ ప్లాన్ చేస్తోంది. 

రాజధాని తరలింపును అడ్డుకునే దిశగా కార్యక్రమాలు రూపొందించాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని పార్టీ భావించింది. ఇప్పటికే సుజన చౌదరి వంటి వారు చాలామంది అమరావతి ఒక్క అంగుళం కూడా కదలదు అని చెప్పడం, రాష్ట్ర శాఖ కూడా తీర్మానం చేయడం చూస్తుంటే... పీపీఏ అగ్రిమెంట్ల లాగే జగన్ ఈ విషయంలో కూడా తోకముడవక తప్పదని అర్థమవుతోంది. మరి ముక్యమంత్రి జగన్ మొండికేసి బీజేపీ కోపాగ్నిలో బలవుతాడా? లేక అమరావతికే పరిమితం అవుతాడా? అన్నది చూడాలి.