​బీజేపీ లో కీలక మార్పు... పవన్ కలిసింది ఆయన్నే

February 27, 2020

బీజేపీ పగ్గాలు చేతులు మారాయి. మోడీ - అమిత్ షా ద్వయం చేతిలో దేశం నలమూలలా సవారీ చేసిన బీజేపీ ఇపుడు కొత్త నాయకుడిని ఎన్నికుంది. పార్టీలో అందరికీ ఇష్టుడైన జేపీ నడ్డా (జగత్ ప్రకాష్ నడ్డా) బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్టీలో ఒకటే నామినేషన్ దాఖలవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. మధ్యాహ్నం రెండున్నరకు ఆయన అధికారికంగా బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 

కొన్ని రోజుల క్రితం బీజేపీతో ఏపీకి చెందిన జనసేన పార్టీ పొత్తు కుదుర్చుకుంది. ఆ పొత్తు కుదిరింది జేపీ నడ్డా చేతుల మీదగానే. వాస్తవానికి జేపీ నడ్డా ఆర్నెల్ల నుంచే పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. అమిత్ షా పూర్తిగా హోంమంత్రి బాధ్యతల్లో నిమగ్నం అవడంతో... వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జేపీ నడ్డా అన్ని బాధ్యతలు మీదేసుకున్నారు. ఇపుడు ఆయనే అధ్యక్షుడయ్యారు. 

జేపీ నడ్డాది పెద్ద వయసేం కాదు. ఆయన వయసు 59 సంవత్సరాలు. సాధారణంగా చూస్తే ఇది రిటైర్ మెంట్ ఏజ్ అయినా... రాజీకయాల్లో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా చూసినపుడు పెద్ద వయసు అనిపించదు. 2019లో ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ ఇన్ ఛార్జిగా 80 ఎంపీ సీట్లకు గాని 62 సీట్లు గెలిచారు. అక్కడ అన్ని వస్తాయని ఎవరూ ఊహించలేదు. అది నడ్డా చాణక్యమే. 2024లో బీజేపీని గట్టెక్కించాల్సిన బాధ్యతలు నడ్డావే.