హంగ్ కు చెల్లుచీటీ... మొత్తం సెట్ చేసిన అమిత్ షా

May 29, 2020

హర్యానా ఫలితాలు వచ్చిన వెంటనే ఓటర్ల తీర్పు హంగ్ కు దారితీసింది. అయితే... బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా... హంగ్ అనే పదానికి అర్థమే లేదు. ఈ పదాన్ని జనాలు వదిలేశారు. బీజేపీ పెద్ద పార్టీగా అవతరిస్తే చాలు.. ఎవరెన్ని పన్నాగాలు పన్నినా అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుంది అంతే. ఇప్పటికే గోవా, కర్ణాటక చూశాం... తాజాగా హర్యానాలో అదే రిపీట్ అయ్యింది. త్రిశంకు స్వర్గం అనే మాట లేదు. ఒక్క రోజులో హంగ్ పోయి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో జేజేపీ పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా బేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతున్నట్లు అమిత్ షా ప్రకటించారు. జేజేపీ తమకు సంపూర్ణ మద్దతు ఇస్తోందని, అందుకే తాము ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇక ఆయన నోటి నుంచి ఆ మాట వస్తే... ఇక గవర్నర్ ఊరుకోరు కదా. రేపో మాపో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. ఖేల్ ఖతం దుకాణ్ బంద్. జేజేపీ సఖ్యంగా ఉంటే ఓకే...లేకపోతే వేర్వేరు పార్టీల నుంచి మెల్లగా మెజారిటీకి అవసరమైన జంపింగ్ లను బీజేపీ ఎంకరేజ్ చేస్తుంది. కావల్సిన సంఖ్య వచ్చాక జేజేపీకి పొగబెట్టడం మొదలుపెడుతుంది. ఏదిఏమైనా... బీజేపీ కేంద్రంలో ఉన్నంత వరకు రాష్ట్రాలన్నీ ఆ పార్టీచేతిలోకి పోతూనే ఉంటాయి. కర్ణాటక తప్ప దక్షిణాది మాత్రమే ఇంకా ఆ పార్టీకి కొరుకుడు పడటం లేదు. కానీ గట్టిగా ప్లానయితే వేశారు.

జేజేపీ తమకు సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు ఆ పార్టీ నేత దుష్యంత్​ చౌతాలా…కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. దాంతో పాటు కొన్ని మంత్రిపదవులు దక్కే అవకాశం ఉంది.