‘చంద్రబాబుకు జైలు ఖాయం’

May 29, 2020

అదేంటే ... కేసు నడవకనే జైలా అని షాక్ తిన్నారా? చంద్రబాబు గ్యారంటీగా జైలుకు పోతారని బీజేపీ నేతే కృష్ణం రాజు చెప్పారు. పదుల సంఖ్యలో కేసులు ఉన్న జగన్ జైలుకు మళ్లీ పోతాడన్న నమ్మకం కృష్ణం రాజుకు లేదు గానీ... ఒక్క కేసు కూడా నమోదు కాకుండా బాబు జైలుకుపోతాడని ఆయన ఎలా చెబుతున్నారు. ఆయన పోలీసు విభాగంలో పనిచేయడం లేదు, అవినీతి సమాచారం తెలియడానికి ప్రభుత్వంలో లేరు. వైసీపీ నేతలే ఇంత కాన్పిడెంటుగా చెప్పలేదు కానీ ఈయనకు అంత కాన్ఫిడెన్స్ ఉందంటే... కేంద్రంలోని బీజేపీయే బాబును జైలుకు పంపడానికి ప్లానేసిందని అర్థం చేసుకోవాలేమో మరి.

’ఎన్నికలకు రెండు వారాల ముందు ‘నన్ను కేంద్రం జైలులో పెడుతుందేమో’ అని చంద్రబాబు ఎన్నికల్లో సింపతీతో ఓట్లు తెచ్చుకోవడానికి అన్నారు. కానీ ఆయన నిజంగానే జైలుకు పోతున్నారు’ అని కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. తప్పు చేసినవాళ్లు జైలుకు వెళ్లక తప్పదని పేర్కొన్న ఆయన చంద్రబాబు చేసిన తప్పులేవో స్పష్టం చేయలేకపోయారు.
చంద్రబాబు చచ్చిన పామట, ఆయనను కొట్టడానికి కర్ర కూడా అక్కర్లేదట. ఇది ఆయన వ్యాఖ్యానం. ఏమిటో... తెలుగునేతలకు చంద్రబాబు మీద ఇంత కక్ష ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్థం కాదు. చిత్రమైన విషయం ఏంటంటే... కేంద్రంలో, రాష్ట్రంలో చంద్రబాబు వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నా చంద్రబాబుపై సరిగ్గా ఒక ఛార్జిషీట్ కూడా దాఖలు చేయలేకపోయారు. ఇది వారికి ఎందుకు సాధ్యం కావడం లేదనేది ఆశ్చర్యకరమైన విషయం.
ముఖ్యమంత్రిగా జగన్ ఏపీకి చేస్తున్న నష్టాన్ని, దారుణమయిన నిర్ణయాల గురించి కృష్ణం రాజు ఒక్క విమర్శ కూడా చేయకపోవడం విశేషం. పైగా తెలుగు ప్రజల సంక్షేమమే రాజుగారికి ముఖ్యమట. మరి అమరావతి, పోలవరం గురించి ఎందుకు ఆయన సీఎంను ప్రశ్నించలేదు?