బీజేపీ నేత పంచ్ కు విజయసాయి మైండ్ బ్లాక్

August 03, 2020

బీజేపీ-వైసీపీల మధ్య గ్యాప్ వచ్చిందని, అందుకే వైసీపీపై బీజేపీ నేతలు సమయం...సందర్భాన్ని బట్టి విమర్శలు గుప్పిస్తున్నారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ పాలనపై, వైసీపీ నేతలపై ఏపీ బీజేపీ నేతలు పలు అంశాల్లో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కమలంపై పసుపు మిడతలు వాలుతున్నాయంటూ బీజేపీ, టీడీపీలనుద్దేశించి  బీజేపీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ రాజకీయంగా పెను దుమారం రేపాయి.

ఏపీ బీజేపీ అధ్యక్షఉడు కన్నాను ఉద్దేశించి విజయసాయి చేసిన ట్వీట్ కు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పసుపు రంగుతోపాటు అన్ని రంగుల్ని కాషాయం రంగు చేయగల బలం బీజేపీకి ఉందంటూ విజయసాయికి  ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఘాటు సమాధానిమిచ్చారు. అంతేకాదు, రఘురామకృష్ణరాజు గారు ఫేడ్ చేస్తున్న మీ రంగుని మీరు కాపాడుకోండి అంటూ వైసీపీని ఉద్దేశించి దేవధర్ ట్వీట్ చేశారు. దేవధర్  పంచ్  ఊహించని విజయసాయికి మైండ్ బ్లాక్ అయింది. 

ఏపీలో 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదాపడిందని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఇళ్ల పట్టాల పంపిణీలో జరిగిన అవినీతిని టీడీపీ నేతలు బయటపెట్టడంతోనే ఈ కార్యక్రమం వాయిదా పడింది. తమ అనుచరులకు, అనుయాయులకే వైసీపీ నేతలు ఇళ్ల స్థలాలు కేటాయించుకున్నారన్న విషయాన్ని టీడీపీ బట్టబయటు చేసింది. ఈ అక్కసును బీజేపీ ఏపీ చీఫ్ కన్నాపై విజయసాయి వెళ్లగక్కారు. 

టీడీపీ మిడతల దండు కమలంపై వాలిందని, అందులో కన్నా కూడా భాగస్వామేనా అంటూ విమర్శించారు. దీంతో, విజయసాయిరెడ్డి ట్వీట్లకు బీజేపీ నేతలు ఘాటు కౌంటర్ ఇచ్చారు. అన్ని రంగులనూ కాషాయంగా మార్చుకోగల బలం బీజేపీకి ఉందని దేవధర్  కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేత ఇచ్చిన పంచ్ కు విజయసాయి కక్కలేక మింగలేక ఉన్నారని టాక్. 

 
మరోవైపు, విజయసాయిరెడ్డిని బీజేపీ కాకుండా సొంత పార్టీపై దృష్టిపెట్టాలని, అలా విజయసాయికి జగన్ సూచించాలని జగన్ కు కన్నా లేఖ రాశారు. బీజేపీపై నిత్యం కామెంట్స్ చేసినా విజయసాయికి ప్రయోజనం ఉండదని కన్నా అన్నారు. ఏది ఏమైనా దేవధర్ నుంచి ఈ తరహా కౌంటర్ వస్తుందని విజయసాయి ఊహించఉండరని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి, దేవధర్ ట్వీట్ కు విజయసాయి సమాధాన మిస్తారా....సైలెంట్ గా ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. 
ఇప్పటికే జగన్ , విజయసాయిల మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అందుకే, పార్టీలో నెంబర్ 2గా ఫీల్ అవుతున్న విజయసాయికి జగన్ చెక్ పెట్టారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో బీజేపీపై విజయసాయి కౌంటర్ లు జగన్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి, విజయసాయి ట్వీట్లకు జగన్ బ్రేకులు వేస్తారా...లేదంటే బీజేపీపై విమర్శలను సమర్థిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.