రెండోసారి కేసీఆర్ ను ఇరికించిన జగన్

July 09, 2020

పాలకులు ప్రజలకు నచ్చింది కాకుండా తమకు నచ్చింది చేస్తున్నారు. ఉదాహరణకు కేసీఆర్ వచ్చాక మద్యం విషయంలో తన నచ్చిన నిబంధనలు మార్చేస్తున్నారు. మద్యం అందుబాటును పెంచారు. కల్లు అమ్మకాలకు అనుమతి ఇచ్చారు. అలాగే ఏపీలో జగన్ కి మద్యం ఇష్టం లేదు కాబట్టి మద్యం బ్యాన్ చేస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా మొండిగా వెళ్తున్నారు. కానీ నేటి రోజుల్లో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు మందు తాగుతున్నారు. ఈ కాలంలో మద్య నిషేధం అనేది అభివృద్ధికి ఆటంకంగా మారేస్థాయికి చేరింది. సినిమాల వల్ల జనాలు ప్రభావితం అవుతున్నారు సినిమాలు ఆపేయలేం. మద్యం వల్ల జనాలు ప్రభావితం అవుతున్నారని మద్యాన్ని బ్యాన్ చేయడం కూడా ఒకరకంగా ఈ కాలంలో చెల్లుబాటు కాదు. కానీ జగన్ ఏపీలోదూకుడుగా వెళ్లిపోతున్నారు. అది ఒక విఫల ప్రయత్నమే అవుతోంది. ఎందుకంటే... మందు దొరక్కపోతే నాటు సారా వైపు మళ్లు తున్నారు. మందు పల్లెల్లో బంద్ అయ్యాక నాటు సారా తయారీ ఒక్కసారిగా ఏపీ ఊపందుకుంది. 

ఇదిలా ఉంటే... ఆర్టీసీ విలీనలం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ సెగ కేసీఆర్ కి తగిలింది. అది నెలన్నరకు పైగా సుదీర్ఘంగా సాగి సుఖాంతమైంది. ఇపుడు జగన్ చేసినట్లే ఇక్కడ మద్య నిషేధం చేయాలని అంటున్నారు. బీజేపీ నేత డీకే అరుణ తదితరులు మద్య నిషేధం కోసం ఏకంగా నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు.  వాస్తవానికి హైదరాబాదు వంటి కాస్మపోలిటన్ నగరంలో ఇది దాదాపు అసాధ్యం. ఈ డిమాండే తప్పు. మద్య నిషేధం కార్పొరేట్ కంపెనీలను ఇబ్బంది పెడుతుంది. లైఫ్ స్టైల్ సదుపాయాల్లో మద్యం ఒకటి. అది లేకపోతే కార్పొరేట్లు సీరియస్ గా పరిగణించే ప్రమాదం ఉంది. ఏదేమైనా బీజేపీ నుంచి ఇలాంటి డిమాండ్ రావడం ఆశ్చర్యకరమే.