జగన్ అసలు రంగును బయటపెట్టిన బీజేపీ

July 07, 2020

సంపూర్ణ హిందూ భారతం నినాదంతో బీజేపీ దూసుకుపోతోంది. ముందు ఒకరితో సంధి చేసుకుని మరొకరిని నాశనం చేయడం... ఆ తర్వాత సంధి చేసుకున్న పార్టీని కూడా నాశనం చేసి తాను అధికారంలోకి రావడం అన్న సిద్ధాంతంతో పక్కా ప్రణాళిక వేసుకుని మరీ ముందుకు పోతున్న బీజేపీ అనేక రాష్ట్రాల్లో ఈ ప్రణాళిక అమలు చేసింది. నిన్న కేంద్రం బీజేపీకి పదవి ఇచ్చిందని జగన్ టీం మురిసిపోయేలోపు ఒక తీవ్రమైన ట్వీట్ వేసి... ప్రజల్లో జగన్ అసలు రంగును బయటపెట్టింది. గతంలో ఇలాగే ఒక వైపు చంద్రబాబుకు కేంద్రంలో పదవులు ఇస్తూనే వెనుక గోతులు తీసింది. ఇపుడు అదే పద్ధతి జగన్తో ఫాలో అవుతోంది. కేంద్రంలో బీజేపీ సఖ్యతగా ఉండి... రాష్ట్ర బీజేపీకి స్వేచ్ఛ ఇస్తుంది. రాష్ట్ర బీజేపీ శాఖ బలపడ్డాక కేంద్రంలో తొక్కేయడం మొదలుపెడుతుంది. తాజాగా జగన్ హిందూత్వ ముసుగును బీజేపీ తొలగించింది.

అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేయడానికి జగన్ నిరాకరించారు. దీనిపై సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. దానిని పోస్టు చేసిన బీజేపీ జగన్ కేవలం ఓట్ల కోసమే హిందువు గాని... అతను నిలువెల్లా క్రిస్టియన్ అన్నారు. ఆంధ్ర హిందువులను జగన్ నమ్మించి ఫూల్స్ ని చేశాడు అని వ్యాఖ్యానించింది బీజేపీ. ప్రశాంత్ కిషోర్ రాసిన బ్రహ్మాండ మైన స్క్రిప్టులో ఆంధ్ర హిందువులు నిట్టనిలువునా మోసపోయారని బీజేపీ పేర్కొంది.

అచ్చం రాహుల్ గాంధీలాగే జగన్ కూడా ఓట్ల కూడా గుడులు చుట్టు తిరిగి పూజలు చేస్తారని, ఇపుడు అధికారం వచ్చాక హిందుత్వానికి దూరంగా జరిగారని అన్నారు. ఈ మేరకు ట్వీట్ ను జగన్ కి ట్యాగ్ చేయడంతో పాటు దీనికి #AntiHinduJagan అంటూ హ్యాష్ టాగ్ పెట్టింది. దీంతో జగన్ ఇంతకాలం చేసిన పూజలు, గృహప్రవేశాలు, దైవ పర్యటనలు అన్నీ ఫేక్ అని అర్థమవుతోంది. ఇలాంటి వ్యక్తిని విశాఖ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి హిందు రక్షకుడిగా పేర్కొన్నారు అంటే... అసలు ఆయన మీదే అనుమానం కలిగే పరిస్థితి ఉందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.