జగన్ మీడియా బ్యాన్... బీజేపీ రెస్పాన్స్ ఏంటి?

February 19, 2020

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ తనకు వ్యతిరేకంగా ఉన్న మీడియా పట్ల అనధికారిక నిషేధం విధించినట్లు నిషేధానికి గురయిన పత్రికలు చెబుతున్నారు. పత్రికలు నిషేధం దాకా వ్యవహారం వచ్చిందంటే... వాటి ప్రభావం వైసీపీపై బలంగా పడిందని అర్థం చేసుకోవాలి. అయినా ఈకాలంలో నిషేధం అనే నియంతృత్వ విధానానికి తావులేదు. ఈరోజు కాకపోయినా రేపయినా నిషేధం ఎత్తేయక తప్పదు. ఇదిలా ఉంటే... ఈ వ్యవహారంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అభిప్రాయం ఏంటి అన్నది అందరికీ ఆసక్తిని కలిగించే విషయం.

కమ్యూనికేషన్లు, ప్రసారాలు, మీడియా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. తెలంగాణలో టీవీ9 ను నిషేధించిన నాటి పరిస్థితులు వేరు, ఇప్పటిపరిస్థితులు వేరు. బీజేపీ ప్రభుత్వం ధరల పెంచినా హక్కుల విషయంలో మాత్రం ప్రజలకు న్యాయం చేసింది. ఎవరు ఏ ఛానెల్ కావాలంటే ఆ ఛానెల్ చూసుకునే అవకాశం ఇచ్చింది. దానిని వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటుందన్న ఫిర్యాదులు ట్రాయ్ కి భారీగా వెళ్లాయి. దీనిపై తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయకణ స్పందించారు. 

టీవీ5, ఏబీఎన్ ఛానళ్లపై నిషేధం విధించడం కరెక్టు కాదని... పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి పత్రికలు నాలుగో స్తంభం వంటివని కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టరులో పేర్కొన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలించిందని... గత ప్రభుత్వం కంటే రెండింతలు ఎక్కువగా అప్రజాస్వామిక పాలన చేసే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం కనిపిస్తోందని ఉందని మండిపడ్డారు.