క‌న్నాకు బీజేపీ షాక్‌

July 08, 2020

ఏపీలో ఎలాగైన ప్ర‌బావం చూపించాల‌ని బీజేపీ భావిస్తోంది. ఈ మేర‌కు వ్యూహాలు ర‌చిస్తుంది. ప‌గ‌డ్భందీగా అభ్య‌ర్ధుల ఎంపిక‌ను నిర్వ‌హిస్తుంది. ఈ మేర‌కు మొద‌టి జాబితాను విడుద‌ల చేసింది. అయితే ఇందులో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం అంద‌రిని ఆశ్య‌ర్యానికి గురిచేసింది. ఆయ‌న‌ వ‌ర్గీయులు షాక్ కు గురయ్యాయి. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ 2014 లో గుంటూరు ప‌శ్చిమ నుంచి బ‌రిలో దిగి గెలిచారు. వైసీపీ దీటుగా పోటీ ఇచ్చ‌న‌ప్ప‌టికి టీడీపీ మ‌ద్ద‌తు ఉండ‌టంతో క‌న్నా విజ‌యం సాధ్య‌మైంది. ఈ సారి కూడా ఆయ‌న అసెంబ్లీ కే పోటీచేస్తార‌ని బావించారు. క‌న్నా కూడా ఇటీవ‌లె నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క‌ల‌పాలు వేగవంతం చేసారు. కాని మొద‌టి జాబితాలో ఆయన‌కు బ‌దులుగా పసుపులేటి మాధవి పేరు కనిపించడంతో బీజేపీ నేతల్లో గందరగోళం నెలకొంది. క‌న్నాకు కాకుండా మ‌రో క‌రికి టికెట్టు ఇవ్వ‌డంతో అవాక్క‌య్యారు. ఏదైనా రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం సర్వసాధారణమే. పోటీ చేయకపోతే మాత్రం అందులో ఏదో మతలబు ఉండే ఉంటుందని భావించాలి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. రాష్ట్రంలో బీజేపీ పరిస్ధితి దారుణంగా ఉందని భావించారో లేక ఎంపీగా గెలిచే అభ్యర్ధులు లేరనుకున్నారో తెలియదు కానీ... కాషాయ నేతలు మాత్రం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నాను ఈసారి లోక్ సభ బరిలో దింపాలని నిర్ణయించారు. దీంతో 123 మందితో ప్రకటించిన బీజేపీ తొలిజాబితాలో కన్నా లక్ష్మీనారాయణ పేరు కనిపించలేదు. కన్నా పేరు ఎందుకు లేదనే అంశంపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. దీనిపై అధిష్ఠానాన్ని నిల‌దీసేందుకుక‌మ‌ల‌నాథులు సిద్ద‌మ‌య్యారు. అయితే మేల్కొన అధిష్ఠానం క‌న్నాను లోక్‌స‌భ నుంచి బ‌రిలోకి దించేప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని శ్రేణుల‌కు చెప్పింద‌ట‌. క‌న్నా ఎక్క‌డినుంచిపోటీచేస్తారు అనేదానిపై స‌స్పెన్స్ నెల‌కొంది.