​’’ సాయిరెడ్డి... నువ్వు బ్రోక​ర్... నీ హద్దుల్లో ఉండు‘‘

June 02, 2020

ఢిల్లీలో నిరంతరం ప్రధానికి వినయంగా ఉంటున్నంత మాత్రాన నోటికి ఎంతొస్తే అంత మాట అంటే ఎవరు ఊరుకుంటారు? అందుకే సాయిరెడ్డికి భారీ దెబ్బ పడింది. టెస్టింగ్ కిట్లలో స్కామ్ జరిగిందని ప్రచారం జరుగుతోంది... వాస్తవాలు వెల్లడించమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు నిన్న రాత్రి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి వాస్తవాలు వెల్లడించి అలాంటిదేం లేదు అని కొట్టిపారేయాల్సిన వైసీపీ ఆ పని చేయకుండా... బూతులు, విమర్శలతో బీజేపీ అధ్యక్షుడు అయిన కన్నాపై దాడికి దిగింది. నవ్వు చంద్రబాబుకు అమ్ముడుపోయిన మనిషివి. చంద్రబాబుకు నిన్ను సుజన చౌదరి అమ్మేశాడు. 20 కోట్లకు అమ్ముడుపోయావు అంటూ వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి కన్నా లక్ష్మినారాయణపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పు పట్టడమే కాదు... విజయసాయిరెడ్డి స్టైల్లోనే షాకింగ్ రిప్లయి ఇచ్చింది. ’’సాయిరెడ్డి... ఏపీ ప్రజలు నిన్ను జైలుపక్షిగా గుర్తిస్తారు. ఢిల్లీలో నువ్వు ఒక బ్రోకరువి. అలాంటి నువ్వు బీజేపీ అధ్యక్షుడిపై దిగజారి విమర్శలు చేస్తావా? నువ్వు కేంద్రానికి ఏమీ తెలియదనుకుంటున్నావు. నీ డబుల్ యాక్షన్ (ఢిల్లీలో వినయం, రాష్ట్రంలో విమర్శలు), నీ కుట్రలు కుతంత్రాలపై ప్రధాన మంత్రి కార్యాలయం గమనిస్తూనే ఉంది. నీ హద్దుల్లో నువ్వు ఉండు‘‘ అంటూ తీవ్ర పదజాలంతో రిటార్ట్ ఇచ్చింది.

బీజేపీ నుంచి కేంద్రంలో అండగా ఉంది కాబట్టి ఇలాంటి రిప్లై ఏపీ బీజేపీ నుంచి వస్తుందని విజయసాయిరెడ్డి ఊహించి ఉండరు. ఇంత తీవ్ర పదజాలంతో బీజేపీ అధికారిక ఖాతా నుంచి రిటార్ట్ రావడం సాయిరెడ్డకి షాకింగే మరి.