పని చంద్రబాబుది, క్రెడిట్ జగన్ కి... అడ్డంగా దొరికారు

August 12, 2020

అధికారంలోకి వచ్చినప్పటి నుండి జగన్ ఏపీలో ఏ పనులు చేస్తున్నారు. దేనిపై దృష్టిపెట్టారు అన్నది అందరికీ క్లియర్ గా తెలుసు. కక్ష సాధింపు జగన్ దినచర్యలో భాగం. ఇంకా తన తప్పులు బాబు మీద వేయడం, బాబు విజయాలను తన ఖాతాలో వేసుకోవడం జగన్ చేస్తున్న మరో ముఖ్యమైన పని. తాజాగా దేశంలో 13 బీచ్ లకు బ్లూ ఫ్రాగ్ సర్టిఫికేషన్ కోసం వైజాగ్ బీచ్ ఎంపికైంది. అయితే.. ఇలాంటిది ఒకటి ఉంటుందని కూడా చాలామందికి తెలియదు. ఇది బీచ్ టూరిజంలో ఒక అత్యున్నత సర్టిఫికెట్.  పని ఎవరిదైనా క్రెడిట్ తమ బాస్ ఖాతాలో వేయడం జగన్ ఫ్యాన్స్ అలవాటు. ఆయన అనుకూల వెబ్ మీడియా అయితే ఈ విషయంలో విపరీతమైన అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటుంది. రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ వ్యవహారానికి సంబంధించిన అన్ని పనులు 2019 ఎన్నికలకు ముందే పూర్తయ్యాయి. కానీ ఆ సర్టిఫికెట్ తెప్పించి వైజాగ్ దశ తిప్పింది జగనన్నే అని నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వైసీపీ బ్యాచ్. 

భారత్‌లోని బీచ్‌లను పర్యావరణహితంగా ముస్తాబు చేసి పర్యాటకులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ కు ఎంపికైన 13 బీచ్‌లలో విశాఖపట్నం రుషికొండ బీచ్ కూడా చోటు దక్కించుకుంది. చంద్రబాబు హయాంలోనే ఎలాగైనా ఈ బీచ్ కి బ్లూ ఫ్రాగ్ సర్టిఫికేషన్ దక్కించుకోవడాికి రూ.7.3 కోట్లు బడ్జెట్‌లో కేటాయింపులు జరుపుతున్నట్లు ప్రకటించారు. దీనిపై అప్పట్లో పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. గూగుల్ లో కూడా ఇప్పటికీ వెతికితే దొరుకుతుంది.

రుషికొండ బీచ్ అభివృద్ధి కోసం పుణేకు చెందిన బీవీజీ కన్స్ట్రక్షన్స్‌కు కాంట్రాక్ట్ బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఇదే కన్స్ట్రక్షన్ సంస్థకు ఒడిశా కొణార్క్ కోస్ట్ ప్రాంతంలోని చంద్రభాగ బీచ్‌ను కూడా అక్కడి ప్రభుత్వం ఇచ్చింది. 2019 ఫిబ్రవరి ఆరంభంలోనే అంటే చంద్రబాబు హయాంలో రుషికొండ బీచ్ అబివృద్ధి పనుల కోసం తొలి విడత మిషనరీ వచ్చింది. చంద్రబాబు హయాంలోనే నిధుల కేటాయింపు, రుషికొండ బీచ్ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. కానీ దీనిని ఇప్పుడు జగన్ ఖాతాలో వేసేశారు. కొందరు నిజం అనుకునే లోపే వైసీపీ బండారం బయటపడింది. గూగుల్ సెర్చి కారణంగా జగన్ బ్యాచ్ అడ్డంగా దొరికిపోయింది. ఈ సర్టిఫికేషన్ కోసం చంద్రబాబు ఎంత తీవ్రంగా ప్రయత్నించిందీ గూగుల్ లో కావల్సినంత సమాచారం దొరుకుతోంది.

 

ఏంటి ఈ బ్లూ ఫ్రాగ్ 

బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ రావాలంటే 33 పర్యావరణ, పర్యాటక అనుకూల నిబంధనలు పాటించాలి. డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఈ బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ అందిస్తుంది. దీనిని 1985లో స్థాపించారు. మూడున్నర దశాబ్దాలుగా ఇది సర్టిఫికెట్ అందిస్తోంది. 46 దేశాల్లో 4,500 బీచ్‌లకు ఈ సర్టిఫికెట్ ఉంది. తొలిసారిగా భారత్‌కు చెందిన 13 బీచ్‌లు ఇందుకు అర్హత సాధించాయి. బ్లూఫ్లాగ్ గుర్తింపు ఉన్న బీచ్‌లకు విశేష ఆదరణ ఉంటుంది. వాటికి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు.

బ్లూఫ్లాగ్ పెట్టిన 33 నిబంధనల్లో.. బీచ్ పరిసరాలు పరిశుభ్రం, నీరు కలుషితం కాకుండా ఉండటం, రసాయనాలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. కేంద్ర అటవీ, పర్యావరణ, మంత్రిత్వ శాఖ పరిశీలనలో బ్లూఫ్లాగ్ బీచ్‌గా ఎంపిక అవడానికి 80 శాతం మార్కులు రావాలి. రుషికొండ బీచ్ పనులు వేగవంతంగా పూర్తయితే నవంబర్ 2019 నాటికే బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ వస్తుందని భావించారు. వివిధ కారణాలతో ఆలస్యమవుతోంది. తాజాగా 53 మార్కులతో రుషికొండ బీచ్ దేశంలో ఎంపికైన 13 బీచ్‌లలో మొదటి స్థానంలో నిలిచింది. జూన్ నెలలో బ్లూఫ్లాగ్ బృందం బీచ్‌ను సందర్శించే అవకాశాలు ఉన్నాయి. రుషికొండ బీచ్‌లో బ్లూఫ్లాగ్ ఎగరవేస్తామని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు హయాంలో ప్రారంభమైన బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ కార్యక్రమాలను జగన్ అభిమానులు అత్యుత్సాహానికి పోయి జగన్ రెడ్డిని నవ్వుల పాలు చేశారు.