మహేష్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ లో లోపమేంటో తెలుసా?

August 07, 2020

మహేష్ బాబు రాజమౌళితో సినిమా ఉంటుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ కథ కు సంబంధించిన హింట్ ఏమీ రాజమౌళి ఇవ్వలేదు. అయినా ఫ్యాన్స్ తమ హీరో కండల వీరుడు కాదు గాబట్టి... ఆయనకు సూటయ్యే రాముడి కథ అయిన రామాయణంతో మహేష్ ను రాముడిలా తీర్చిదిద్ది ఒక అభిమాని పోస్టరు తయారుచేశారు.

అభిమాని తన శక్తివంచన లేకుండా ప్రయత్నించి చాలా వరకు బాగానే చేశాడు. కానీ  రెండు లోపాలు పోస్టరులో కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్త పడి ఉంటే అవి కూడా సరిదిద్దే అవకాశం ఉండేదేమో. మరి ఫ్యాన్ కి అన్ని సదుపాయాలున్నో లేదో. ఇక లోపాల విషయానికి వస్తే

రాముడి పాత్ర కోసం మహేష్ గడ్డం ఉన్న ఫొటో కాకుండా గడ్డం లేని ఫొటో ఎంచుకుని ఉంటే బాగుండేది. గడ్డం ఉన్న రాముడి ఫొటో మనకు సినిమాల్లో కూడా కనిపించదు. కాబట్టి అభిమాని గడ్డం మీసాలు లేని మహేష్ ఫొటోతో దీనిని చేసి ఉంటే బాగుండేది. మొహం ప్యాచ్ చేసేటపుడు జుట్ట దగ్గర చేసిన ఫొటో షాప్ వర్క్ కొంచెం తేలిపోయింది. ఇది కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది... జుట్టపక్కన స్టాంప్ వర్క్ ఇన్విజిబుల్ గా కనిపిస్తోంది.

ఇక చాలా సిల్లీ మిస్టేక్ ఒకటుందీ పోస్టరులో ... S S Rajamouli's అని పోస్టర్లో రాస్తారు. కానీ ఈ ఫ్యాన్ మేడ్ పోస్టరులో S S .Rajamouli అని రాశారు. కొత్తగా డాట్ (.) వాడాడు. అపాస్ట్రపియస్ మిస్సయ్యాడు. కావాలంటే బాహుబలి పోస్టర్లు చూసుకోవచ్చు.

సరే ఎన్ని తప్పులున్నా అభిమాని ప్రయత్నం, తాపత్రయం మెచ్చుకోదగ్గదే.