చంద్రబాబు దుర్మార్గుడు, మరి జగన్ ఇపుడు ఏం చేస్తారు

February 25, 2020

ముఖ్యమంత్రి పదవిని ఒక బంపరాఫర్ గా భావించి... నోటికి వచ్చిన విమర్శలు చేద్దాం, వస్తే సీఎం పదవి. సీఎం అయ్యాక మిగతావన్నీ చూసుకుందాం. ఇది ప్రతిపక్షంలో ఉన్నపుడు వైసీపీ ధోరణి. ఈ భూమి మీద మనుషులు బతికి ఉన్నంత వరకు నేరాలు జరుగుతూనే ఉంటాయి. ఎంత కఠిన శిక్షలు అమలుచేసినా నేరాలు జరగకుండా మానవు. తప్పులు జరగకుండా పోవు. కానీ ప్రతిపక్షంలో ఉన్నపుడు చిన్న తప్పులకు, ప్రతి నేరానికి ముఖ్యమంత్రిని నీచంగా దారుణంగా మాట్లాడటం, చంద్రబాబు ఆనాడు వాటిని పట్టించుకోకపోవడం వల్ల ఏకంగా పదవే పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. 

ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు దేవుడు అందరికీ స్క్రిప్టు రాస్తాడు. జగన్ కీ రాశాడు. గతంలో ఇపుడు బోటు ప్రమాదం జరిగిన స్థలానికి సమీపంలోనే ప్రమాదం జరిగి అప్పట్లో పాతిక మంది మరణించారు. అప్పట్లో జగన్ దీనిపై ఇలా మాట్లాడారు. 

‘‘ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంతమంది చనిపోయారు. ప్రభుత్వంపై, చంద్రబాబుపై హత్యానేరం మోపాలి. ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిద్రపోతుందా? అనుమతి లేనిపడవలు, లైసెన్సులు లేని బోట్ల వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీనికి బాధ్యత ముఖ్యమంత్రిదే. చంద్రబాబు నిర్లక్ష్యం, అవినీతి వల్ల జరిగిన హత్యలు ఇవి. మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించాలి.’’

కట్ చేస్తే... సేమ్ ప్లేస్, సేమ్ యాక్సిడెంట్... తమాషా ఏంటంటే... ఆ బోటు కూడా వైసీపీ నేత అయిన కోడిగుడ్ల వెంకటరమణది. మరి చంద్రబాబు దుర్మార్గుడు... మానవతావాది అయిన జగన్ డిమాండ్ ను పరిగణించలేదు. బాధితులకు 25 లక్షలు ఇవ్వలేదు. మరిపుడు జగన్ ముఖ్యమంత్రి. బోటు  ప్రమాదం జరిగింది. బోటుకు అనుమతి లేదు కాబట్టి ముఖ్యమంత్రి జగన్ పై కేసు పెట్టాలా? అతనికి శిక్ష వేయాలా? 25 లక్షలు వెంటనే ఇస్తారా? 

కట్ చేస్తే... గతాన్ని మరిచిపోయిన జగన్ తాను చెప్పింది న్యాయం కాదని, చంద్రబాబు చేసిందే న్యాయం అన్నట్లు ప్రవర్తించారు. కేవలం 10 లక్షలు మాత్రమే బాధితులకు పరిహారం ఇచ్చారు. తనపై పోలీసులు ఏం కేసు నమోదు చేయలేదు. 

Read Also

బీజేపీ మాస్ట‌ర్ స్ట్రోక్‌ : సార్ కి దిమ్మతిరిగింది
ఇదేం అజ్జానం సీఎం గారు !
జగన్ తీరుపై ఇంగ్లిష్ పేపర్లలో ఎడిటోరియల్స్ ..!