షాక్: హీరోయిన్ కి జైలు శిక్ష !!

August 14, 2020

బాలీవుడ్ నటి పాయల్ రోహ్ తగి కి జైలు శిక్ష పడింది. నెహ్రూ గాంధీ కుటుంబంపై సోషల్ మీడియా లో ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం చెప్పడంతో ఆమె ట్వీట్ వైరల్ అయ్యింది. పలువురు ఆమె తీరును తప్పుపట్టారు. కొందరి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీంతో రాజస్తాన్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమె కేసును విచారించిన కోర్టు రిమాండ్ కు పంపింది. ఈనెల 24 వరకు ఆమెకు జుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది. ఆమె కు బెయిల్ కూడా దక్కలేదు. 

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న ఆమెను పోలీసులు అరెస్టు చేయడానికి రావడంతో దాని గురించి ఆమె సోషల్ మీడియాలో పాయల్ ఇలా స్పందించారు. మోతీలాల్ నెహ్రూపై వీడియోను రూపొందించినందుకు నన్ను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. గూగుల్ లో దొరికిన సమాచారాన్ని నేను సేకరించి వీడియో చేశాను. వాక్ స్వేచ్ఛ మన దేశంలో ఒక జోక్ గా మిలిగిపోయిందా? ప్రధాని గారు, హోంమంత్రి గారు మీకో దండం! 

ఇటీవల సోషల్ మీడియా కేసులో దేశంలో పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా స్వేచ్ఛను ఇచ్చింది. కానీ దాని వాడకంలో తేడా వస్తే.. ఇలా జైలు పాలవుతున్నారు. కానీ సోషల్ మీడియా కామెంట్ చేసి ఓ హీరోయిన్ జైలుపాలు కావడం దేశంలో ఇదే తొలిసారి.