మానం మర్యాద వదిలేసిన సిల్వర్ స్క్రీన్ పరిటాల

May 27, 2020

పోలిక బాగున్నా.. మ‌ర్యాద‌కు దూరంగా ఉండేవాటిని న‌లుగురి ఎదుట చెప్పేందుకు త‌ట‌ప‌టాయిస్తుంటారు. తాజాగా అలాంటిది వదిలేసి.. దారుణ‌మైన రీతిలో బాలీవుడ్ న‌టుడు.. రీల్ ప‌రిటాల ర‌విగా తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడైన వివేక్ ఓబెరాయ్ తాజాగా చేసిన ఒక ట్వీట్ వివాదాస్ప‌దంగా మారింది.
ప్ర‌ముఖ న‌టి ఐశ్వ‌ర్య‌రాయ్ ను ఎగ్జిట్ పోల్స్ తో పోలుస్తూ ఆయ‌న చేసిన ట్వీట్ ను త‌క్ష‌ణ‌మే డిలీట్ చేయాల‌ని ప‌లువురు కోరుతున్నారు. ఏ మాత్రం మ‌ర్యాద‌గా లేని ఈ ట్వీట్ వివేక్ లాంటి వారు ట్వీట్ చేయ‌టం ఏమిట‌న్న మాట ప‌లువురినోట వినిపిస్తోంది.
ఇంతకీ వివేక్ పోస్ట్ చేసిన ట్వీట్ ఏమిటంటే.. ఐశ్వ‌ర్య పెళ్లికి ముందు సల్మాన్ ఖాన్ తోనూ.. వివేక్ ఒబ‌రాయ్ తోనూ ప్రేమాయ‌ణం ఉండేది. ఆ త‌ర్వాతి కాలంలో అవి పోవ‌టం.. ఆమె న‌టుడు అభిషేక్ బ‌చ్చ‌న్ ను పెళ్లాడ‌టం తెలిసిందే. ఇదే విష‌యాన్ని ఆయ‌న అమ‌ర్యాపూర్వ‌కంగా.. సంద‌ర్భానికి సంబంధం లేని రీతిలో తెర మీద‌కు తెచ్చారు వివేక్.
ఆదివారం ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు విడుద‌లైన కాసేప‌టికే వివేక్ ఓబెరాయ్ ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. అందులో ఐష్ స‌ల్మాన్ క‌లిసి ఉన్న ఫోటోకు ఒపినియ‌న్ పోల్ అని.. ఐష్-వివేక్ క‌లిసి ఉన్న ఫోటోకు ఎగ్జిట్ పోల్ అని.. ఐష్-అభిషేక్ ఉన్న ఫోటోకు రిజ‌ల్ట్ అన్న క్యాప్ష‌న్లు రాసి ఉన్నాయి. ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ.. హ హ‌.. క్రియేటివ్.. ఇది రాజ‌కీయం కాదు. కేవ‌లం జీవితం అని రాశారు.
ఒక పెళ్లైన మ‌హిళ గ‌తానికి సంబంధించి ఇలా పోస్ట్ చేయ‌టంపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. చివ‌ర‌కు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ సైతం ఆయ‌న‌కు నోటీసులు పంపింది. ఎగ్జిట్ పోల్స్ ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డిమాండ్ చేసింది. ఈ ట్వీట్ ను ప‌లువురు ప్ర‌ముఖులు త‌ప్పు ప‌డుతున్నారు.
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ధూర్ బండార్క‌ర్ స్పందిస్తూ.. ప్రియ‌మైన వివేక్ ఓబెరాయ్.. నీ నుంచి ఇలాంటి ట్వీట్ ను ఎప్పుడూ ఊహించ‌లేదు. విమ‌ర్శ‌కులు ఎంత‌కైనా తెగించి.. ఏ త‌ర‌హా మీమ్స్ అయినా చేస్తుంటారు. కానీ.. బాధ్య‌త క‌లిగిన ఒక సెల‌బ్రిటీ అయిన మీరు మ‌రొక‌రి మ‌నోభావాల్ని దెబ్బ తిన‌కుండా ప్ర‌వ‌ర్తించాలి. ద‌య‌చేసి క్ష‌మించ‌మ‌ని కోరుతూ.. ట్వీట్ డిలీట్ చేయ‌మ‌ని కోరారు. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో వివేక్ వ్య‌వ‌హార‌శైలిని ప‌లువురు ప్ర‌ముఖులు త‌ప్పు ప‌డుతున్నారు. బోడి ట్వీట్ కోసం భారీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటావా వివేక్?

మహిళా కమిషన్ కూడా దీనిపై స్పందించింది. వివేక్ కు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి మరీ చీప్ ఆలోచనలు ఉన్న వ్యక్తి ఒకప్పుడు పరిటాల రవి గా తెరపై కనిపించారు. ఇపుడు మోడీగా కనిపించబోతున్నారు. ఇలాంటి బుద్ధి ఎలా పుట్టింది వివేక్ నీకు.